Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీలో విబేధాలు: ఎస్వీకి ఎమ్మెల్యే సవాల్
By: Tupaki Desk | 3 Feb 2020 9:16 AM GMTఇన్నాళ్లు లోలోన ఉన్న అసంతృప్తి బయటకు వస్తోంది.. నాయకుల మధ్య ఉన్న వర్గపోరు ఉబికివస్తోంది. అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో నాయకుల మధ్య సమన్వయం కొరవడి విబేధాలు వస్తున్నాయి. తాజాగా కర్నూల్ జిల్లా వైఎస్సార్సీపీలో నేతల్లో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య కొంతకాలంగా సాగుతున్న వర్గపోరు బయటపడింది. దీనికి కార్యకర్తల చేరికలు వేదికగా మారాయి. తనతో చెప్పకుండా కార్యకర్తలను ఎస్వీ మోహన్ రెడ్డి చేర్చుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.!. ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా చేస్తావా? అని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే.. పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పకుండా మిగతా వారిని పార్టీలో చేర్చుకోవాలని మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
ఎస్వీకి సవాల్ ‘నన్ను కొట్టండి.. నేను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను.. కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు. మా కార్యకర్తలపై దాడులు చేస్తే, మేం చూస్తూ ఉరుకోం. వారికి అండగా ఉంటాం. కర్నూలును అన్నివిధాలా మంచి చేస్తానని ముఖ్యమంత్రి నాతో చెప్పడం అది జగన్ మంచితనానికి నిదర్శనం’ అని హఫీజ్ పేర్కొన్నారు. ఈ విబేధాలు మొదటి నుంచి వీరి మధ్య ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి అనంతరం తెలుగుదేశం లోకి వెళ్లారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సమయం వరకు టీడీపీ కి రాజీనామా మళ్లీ సొంత పార్టీ వైఎస్సార్సీపీ లో చేరారు.
అయితే 2019 ఎన్నికల సమయంలో మోహన్ రెడ్డి కి టికెట్ కేటాయించకుండా హఫీజ్ కే టికెట్ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గా గెలిచాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఇద్దరి నాయకుల మధ్య విబేధాలు తారస్థాయికి వెళ్లకముందే పార్టీ అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక కార్యకర్తలు కోరుతున్నారు. మరీ ఈ విబేధాలను పార్టీ ఎలా సద్దుమణిగిస్తుందో వేచి చూడాలి.