Begin typing your search above and press return to search.
పాక్ ప్రధానిని అంత మాట అనేశాడే!
By: Tupaki Desk | 23 Jun 2019 4:21 AM GMTభారత్-పాక్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాక్ ప్రధాని కమ్ ఒకప్పటికీ క్రికెట్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. తన నేతృత్వంలో పాక్ జట్టుకు ప్రపంచకప్పును అందించిన ఇమ్రాన్ ఇచ్చిన ట్వీట్ సూచనపై ఘాటుగా రియాక్ట్ కావటం షాకింగ్ గా మారింది. టాస్ గెలిస్తే ఏం చేయాలన్నది జట్టు నిర్ణయమని.. ఎవరో చెబితే చేసేది కాదన్న మాట కచ్ఛితంగా ఇమ్రాన్ ను ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్నారు.
హఫీజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారనున్నాయి. భారత్ తో జరిగే మ్యాచ్ లో టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేస్తే మంచిందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ సూచన చేశారు. ఇందుకు భిన్నంగా టాస్ గెలిచినప్పటికీ పాక్ కెప్టెన్ సర్పరాజ్ బౌలింగ్ ఎంపిక చేసుకున్నారు. మ్యాచ్ ఓటమితో ఇమ్రాన్ సలహాను పాటించి ఉండాల్సిందన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఇదే కాదు.. భారత్ తో మ్యాచ్ సందర్భంగా జట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుందన్న విషయాన్ని ఇమ్రాన్ సూచన చేశాడు. పాక్ ప్రధాని సూచనను పెడచెవిన పెట్టినందుకే భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ అల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలన్నది జట్టు నిర్ణయమని.. ఎవరో ట్వీట్ చేసి సూచిస్తే తీసుకునే నిర్ణయం కాదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
నేరుగా ఇమ్రాన్ పేరును ప్రస్తావించకున్నా.. ఎవరో చేసిన సూచనను పాటించాల్సిన అవసరం లేదన్న మాట కచ్ఛితంగా ప్రధాని ఇమ్రాన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా అర్థమవుతున్న పరిస్థితి. హఫీజ్ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. జట్టు ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యులే అన్న అతడు.. తమ ఓటమికి చెత్త బౌలింగ్ కారణమన్నారు.
ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇచ్చిన ట్వీట్ సలహాను ఎవరో చెబితే పాటించాల్సిన అవసరం లేదన్న మాట ఇప్పుడు పెద్దదిగా మారి.. పెను వివాదంగా మారుతోంది. ఇమ్రాన్ ప్రధాని అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఆయన మాజీ ప్రముఖ క్రికెటర్ అన్న విషయాన్ని హఫీజ్ పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.