Begin typing your search above and press return to search.

హత్యల తర్వాత హాజీపూర్ కిల్లర్ ఏం చేసేవాడంటే.?

By:  Tupaki Desk   |   2 May 2019 11:04 AM GMT
హత్యల తర్వాత హాజీపూర్ కిల్లర్ ఏం చేసేవాడంటే.?
X
హాజీపూర్ లో ముగ్గురు అమాయకపు విద్యార్థులపై అత్యాచారం చేసి హత్య చేసిన సీరియల్ కిల్లర్ వ్యవహారశైలిపై ఆ ఊరి గ్రామస్థులు, శ్రీనివాస్ రెడ్డితో చదివిన మిత్రులు కథలు కథలు చెబుతున్నారు. అతడి వ్యవహారశైలి గురించి పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడూ ఎవరితోనూ కలవడని.. ఎవరికీ ఎక్కువ కనిపించడని.. కానీ ఏదైనా దారుణం చేసినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీనిద్వారా తనపై అనుమానం రాకుండా చూసుకుంటాడని ప్రవర్తిస్తాడంటున్నారు.

ఈనెల 26వ తేదీన కూడా ఇలానే ఊరిలో హల్ చల్ చేశాడట.. అదే రోజు శ్రావణిని అత్యాచారం చేసి హత్య చేశాడు. అప్పుడు ఊరి మధ్యలో ఉన్న చిన్న ఖాళీ ప్రదేశంలో పిల్లలతో క్రికెడ్ ఆడాడట.. ఎవరికి అనుమానం రాకుండా ఇలా చేశాడని అర్థమవుతోంది. మర్నాడు తన పాఠశాల మిత్రుడి పెళ్లికి భువనగిరి వెళ్లి అక్కడ మిత్రులతో కలిసి విందులో పాల్గొని చిందులేశాట.. ఇలా శ్రీనివాస్ రెడ్డిలో ఉత్సాహం చూసి తాము ఆశ్చర్యపోయామని.. ముభావంగా ఉండే అతను ఇలా ఆనందంగా ఉండడం తాము చూడలేదని అతడి చిన్ననాటి మిత్రులు వివరించారు. తాను చేసిన ఘోరం బయటపడకుందా అనుమానం రాకుండా ఇలా తన సహజ స్వభావానికి విరుద్ధంగా శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తించాడని ఇప్పుడు అతడి స్నేహితులు బేరీజు వేసుకుంటున్నారు.

శ్రీనివాస్ రెడ్డి మొహంలో ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించిందని అతడితోపాటు పదోతరగతి వరకూ చదివినవాళ్లు చెబుతున్నారు. మొత్తం 150మంది ఉన్న వాళ్ల బ్యాచ్ లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే కలిసిపోయేవాడు కాదన్నారు. చదువులో పూర్ అని.. ఉపాధ్యాయులు కొడుతున్నా ఎన్ని దెబ్బలైనా తిన్నా అతడి మొహంలో బాధ, భయం పశ్చాత్తాపం ఉండేది కాదన్నారు. గ్రామంలోనూ ఎవరితో కలిసేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంతటి తీవ్ర నేరస్వభావం గల వ్యక్తి ఇన్నేళ్ల నుంచి ఎన్నో దారుణాలు చేసి ఉంటాడని అవేవీ బయటకు వచ్చి ఉండవని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను కూడా పోలీసులు పరిశీలించారు. 631 మంది స్నేహితులుంటే.. ఇందులో పురుషులు 50మంది మాత్రమేనని.. మిగతా యువతులంతా వేరు వేరు ప్రాంతానికి చెందినవారేనన్నారు. అందులో భాగంగానే వారి వలవేస్తూ ఇది వరకు కర్నూలు వెళ్లి అక్కడ యువతిని చంపి పీపాలో కుక్కాడని.. వేములవాడ, కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు కూడా తరుచుగా వెళ్తుంటాడని వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని మిస్సింగ్ కేసుల పై కూడా ఇప్పుడు పోలీసులు ఆరాతీస్తున్నారు. అందుకోసం మరోసారి శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇక గతంలో శ్రీనివాస్ రెడ్డి హాజీపూర్ లో ఓ మహిళను వేధిస్తే ఊరంతా కలిసి చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ కోపంతోనే ఇలా అత్యాచారం చేసినప్పుడు తన బండారం బయటపడితే మళ్లీ కొడుతారనే వారిని అత్యాచారం చేసి అనంతరం చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనే అతడిని క్రూరుడిగా మార్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇక బొమ్మల రామారం బాలిక అదృశ్యంతోపాటు కరీంనగర్ జిల్లాలో మిస్సింగ్ లపై కూడా రాచకొండ సీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి బైక్ పై వెళ్తున్న ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో అత్యంత గంభీరంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి వీడియో వైరల్ గా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి