Begin typing your search above and press return to search.

అప్ డేట్స్; ఇప్పటికి 717 మంది చనిపోయారు

By:  Tupaki Desk   |   24 Sep 2015 4:19 PM GMT
అప్ డేట్స్; ఇప్పటికి 717 మంది చనిపోయారు
X
మక్కా లో చోటు చేసుకున్న దారుణ తొక్కిసలాటలో అంతకంతకూ మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దుంతంలోబాయ్ కాలమాన ప్రకారం గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో భారీగా మరణాలు చోటు చేసుకున్నాయి. సైతాన్ మీద రాళ్లు విసిరేందుకు ఒక్కసారిగా జన ప్రవాహం తోసుకొచ్చిన క్రమంలో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో.. గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన టాప్ అప్ డేట్స్..

= భారత కాలమానం గురువారం సాయంత్రం 6.30 గంటల సమయానికి తొక్కిసలాట కారణంగా మరణించిన వారి సంఖ్య 717లకు చేరుకుంది. గాయాల పాలైన వారి సంఖ్య 800 పైచిలుకు ఉంటుందని భావిస్తున్నారు.

= ఈ భారీ ప్రమాదానికి కారణం చూస్తే.. హజ్ యాత్రలో భాగంగా మక్కాలోని మినా ప్రాంతంలో సైతాన్ గా పిలిచే మూడు స్తంభాలపై రాళ్లు విసరటం అలవాటు. ఇందుకోసం యాత్రికులు మినా నుంచి మక్కాకు వెళ్లటానికి సౌదీ అధికారులు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే.. యాత్రికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోకుండా కాలి నడకన బయలుదేరటమే భారీ ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

= మినాలోని జాదిడ్ వీధిలో తొక్కిసలాట చోటు చేసుకుందని భావిస్తున్నారు.

= తొక్కిసలాటలోని మృతుల్లో ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు చెందిన వారు.. ఇరానీయులే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

= మక్కా తొక్కిసలాటలో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన షేక్ బీబీజా మృతి చెందారు. సెప్టెంబర్ 2న కటుంబ సభ్యులతో మక్కాకు వెళ్లిన ఆమె.. తొక్కిసలాటలో మరణించారు.

= ఈ ఏడాది హజ్ యాత్రకు భారత్ నుంచి 1.5లక్షల మంది భారతీయులు వెళ్లినట్లు అంచనా.

= ఈ ఘటనపై ప్రధాని మోడీ.. తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు.. కేసీఆర్ లు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియ చేశారు.

= మక్కాకు వెళ్లిన ఏపీ యాత్రికులు 400 మంది క్షేమంగా ఉన్నట్లు ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ అబిద్ రషీద్ ఖాన్ వెల్లడించారు. మిగిలిన తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నట్లుగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.