Begin typing your search above and press return to search.

రోజులో మీమ్స్ కోసం అరగంట.. క్రేజీ ఇదీ

By:  Tupaki Desk   |   24 Aug 2022 2:30 AM GMT
రోజులో మీమ్స్ కోసం అరగంట.. క్రేజీ ఇదీ
X
మీమ్స్.. ట్రెండ్ కు తగ్గట్టుగా.. సమయానుసారంగా వేసే మీమ్స్ అదిరిపోతుంటాయి. ఇప్పుడు ఏది ట్రెండింగ్ అయితే దాని మీద నెటిజన్లు తయారు చేసే మీమ్స్ కేక పుట్టిస్తాయి. నవ్వులు తెప్పిస్తాయి. సోషల్ మీడియా ముఖ్యంగా బ్రహ్మానందం హావభావాలు పెట్టి తయారు చేసే మీమ్స్ బాగా సూపర్ హిట్ అవుతుంటాయి. బ్రహ్మానందం ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది.అందుకే అతడిపై ట్రోలర్స్ ఎక్కువగా మీమ్స్ తయారు చేస్తుంటారు. ఇక క్రీడలు, సినిమాలు, సీరియల్స్, వర్ధమాన రాజకీయాలపై కూడా మీమ్స్ వెల్లువెత్తుతుంటాయి.

దేశంలో మీమ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. వాటి పాపులారిటీ కాదనలేనది. సెటైర్లు, కామెడీతో నవ్వులు పూయించే ఈ మీమ్స్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజే వేరు. అయితే ఈ మీమ్స్ క్రేజ్ భారత్ లో ఇంకాస్త ఎక్కువ ఉందనే చెప్పాలి.

భారత్ లో మీమ్స్ కోసం రోజులో ఓ అరగంట కేటాయిస్తారట.. 90 శాతం యూజర్లు సొంతంగానే ఈ మీమ్స్ ను తయారు చేస్తున్నట్టు తేలింది. అంతేకాదు వీటి ద్వారా తమ పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం గత ఏడాదే మీమ్స్ ఫాలో అయ్యే వారి సంఖ్య 80 శాతం పెరిగిందంటే అతిశయోక్తి కాదు.

గత ఏడాది మీమ్స్ ఫాలో అయ్యే వారి సంఖ్య సోషల్ మీడియాలో 80 శఆతం పెరగిందని తేలింది. దీంతో నెటిజన్లు మీమ్స్ ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. వీటి ద్వారా తమ ప్రచారాన్ని కూడా జనాలను ఆకట్టుకునేలా చేసుకుంటున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న మీమ్ పై రాజకీయ వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకొని చేసిన మీమ్స్ కొదవలేదు. ఇక ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ‘పుష్ప’ సినిమాపై మీమ్స్ ను రాజకీయ పార్టీలు చేసుకొని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి.

ఒక గొప్ప ప్రసంగం కంటే ఒక చిత్రం ద్వారా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభం. కామెడీ, సెటైర్, జనాకర్షణ విషయంలో మీమ్స్, కార్టూన్ ను మించిన ఆయుధం లేదు. దాంతోనే ఇప్పుటు నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి వినూత్నంగా తయారు చేస్తున్నారు. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.