Begin typing your search above and press return to search.
ఎలన్ మస్క్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్ యేనట?
By: Tupaki Desk | 3 May 2022 1:30 AM GMTప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు.. టెస్లా సీఈవో.. త్వరలో కాబోయే ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. ట్విట్టర్ లో లక్షల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. అయితే ట్విట్టర్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్ అనే విషయాన్ని ఆన్ లైన్ ఆడిటింగ్ కంపెనీ స్పార్క్ టోరో తెలిపారు.
ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం.. ఎలన్ మస్క్ కు ఉన్న 87.9 మిలియన్ల మంది పాలోవర్లలో దాదాపు 48 శాతం మంది నకిలీ అని టైమ్ నివేదించింది.
ఇందులో స్పామ్ ఖాతాలు.. బాట్ ఖాతాలు ఉండి ఉండొచ్చని.. అదీ కాదంటే వారు ట్విట్టర్ ఖాతా చాలా రోజుల నుంచి వాడి ఉండరని తెలిపింది. ప్రస్తుతం మస్క్‌కి ట్విట్టర్‌లో దాదాపు 90 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
స్పార్క్ టోరో ప్రకారం.. అతను దాదాపు 7 శాతం ఎక్కువ నకిలీ అనుచరులను కలిగి ఉన్నారని తేలింది. మధ్యస్థ 41 శాతం ఖాతాలు ఒకే పరిమాణంలో ఉన్న ఫాలోయింగ్‌లను కలిగి ఉన్నాయని తెలిపింది.ఎలన్ మస్క్ లక్ష ఖాతాల నుంచి 2 వేల ఖాతాలను తీసుకొని లెక్కగట్టారు. అందులో 25 రకాల అంశాలను పరిశీలించి చూశారు. చాలా మట్టుకు స్పామ్, బాట్, లోక్వాలిటీ అకౌంట్లు ఉన్నాయని తేలింది. 41శాతం ఫాలోవర్లు ఖచ్చితంగా అబద్దమేనని తేలింది.
ఇటీవలే ఎలన్ మస్క్ $44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ టేకోవర్ డీల్‌ను విజయవంతంగా చేరుకున్నాడు. "కొత్త ఫీచర్లతో ఉత్పత్తిని మెరుగుపరచడం, నమ్మకాన్ని పెంచడానికి అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేయడం, స్పామ్ బాట్‌లను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్విట్టర్‌ను గతంలో కంటే మెరుగ్గా మార్చాలనుకుంటున్నాను" అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు.
"ట్విట్టర్ అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాన్ని అన్‌లాక్ చేయడానికి కంపెనీ మరియు వినియోగదారుల సంఘంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను" అని కొత్త ట్వీట్టర్ సీఈవోని నియమించాలని యోచిస్తున్న మస్క్ అన్నారు.
మస్క్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫాలోవర్లు 58.4 మిలియన్లు మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫాలోవర్ల సంఖ్య మరియు 131.7 మిలియన్లలలో కూడా నకిలీలు ఉన్నారని తేల్చారు. బిల్ గేట్స్ ఖాతాలో 46 శాతం.. ఒబామా ఖాతాలో 44 శాతం మంది నకిలీ ఫాలోవర్లను కలిగి ఉన్నారని సంస్థ తేల్చింది.