Begin typing your search above and press return to search.

లేటెస్ట్ అప్డేట్: కరోనా 'ఫ్రీ' గా సగం భారతదేశం..!

By:  Tupaki Desk   |   20 April 2020 12:10 PM GMT
లేటెస్ట్ అప్డేట్: కరోనా ఫ్రీ గా సగం భారతదేశం..!
X
కరోనా మహమ్మారిని కట్టడిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ అమలులోకి వచ్చి ,దాదాపుగా నెల రోజులు కావొస్తుంది. దీనితో దేశంలో కరోనా మహమ్మారి ఏ విదంగా విస్తరిస్తుంది అని ప్రభుత్వం ఒక అంచనాకి రావచ్చు. ఇప్పటివరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్ని ఒకసారి పరిశీలిస్తే .. స‌గం భార‌తదేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి లేద‌నే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ కూడా దేశంలోని 401 జిల్లాల్లోనే వెలుగులోకి వచ్చాయి. మిగిలిన 325 జిల్లాల్లో క‌రోనా కేసుల జాడ లేద‌ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల నివేదిక‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. దేశంలోని మొత్తం క‌రోనా కేసుల్లో దాదాపు 46 శాతం కేసులు కేవ‌లం 18 జిల్లాల ప‌రిధిలోనే న‌మోదైన‌వి కావ‌డం! గమనార్హం. 401 జిల్లాల్లో క‌రోనా మహమ్మారి విస్తరించినప్పటికీ .. కేవలం 18 జిల్లాల్లోనే మొత్తం 46 శాతం కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన దాదాపు 383 జిల్లాల్లో జిల్లాల్లో క‌లిపి 54 శాతం కేసులున్నాయని ఆయా ప్రభుత్వాల నివేదిక‌ల ఆధారంగా తెలుస్తోంది. మ‌హారాష్ట్రంలోని ముంబై - మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ - చ‌త్తీస్ గ‌డ్ లోని కోర్బా - జార్ఖండ్ లోని రాంచీ - ఒడిశాలోని కుర్దా - తెలంగాణ‌లోని హైద‌రాబాద్..జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో న‌మోదు అయిన కేసుల్లో 50 శాతం కేసులు ఈ జిల్లాల్లోనే నమోదు అయ్యాయట. లాక్ డౌన్ మొదలైయ్యి దాదాపు నెల రోజులు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ప‌రిస్థితి ఈ విదంగా ఉంది. దేశంలో 17,615 కేసులు న‌మోదు అయ్యాయి. దాదాపు 559 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.2,854 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 14,202 మంది ప్రస్తుతం కరోనా కి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.