Begin typing your search above and press return to search.

పీవీపై ఉప‌రాష్ట్రప‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   29 Jun 2016 9:00 AM GMT
పీవీపై ఉప‌రాష్ట్రప‌తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఉప రాష్ట్రపతి హమిద్‌ అన్సారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన ప‌నుల‌కు ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంద‌ని అన్నారు. హిందువులు - ముస్లింలుగా పీవీ వ్యాఖ్య‌ల‌ను విశ్లేషిస్తూ అన్సారీ ప్ర‌సంగించ‌డం క‌ల‌క‌లంగా మారింది.

ప్ర‌ముఖ విశ్లేష‌కులు విన‌య్‌ సీతాపతి రాసిన హాఫ్‌ లయన్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అన్సారీ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థలో పీవీ చేసిన మార్పులు సమర్థనీయమైనా ఆయన తలపెట్టిన కీడుతో ఇప్పటికీ భారీ మూల్యం చెల్లించాల్సివస్తున్నదని అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి సంబంధించి పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను అన్సారీ ఉటంకించారు. 'మసీదును కాపాడాలని - హిందువుల సెంటిమెంట్‌ ను పరిరక్షించాలని - తనను తాను కాపాడుకోవాలని పీవీ భావించారు. అయితే చివరికి మసీదు ధ్వంసమైంది. హిందువులూ కాంగ్రెస్‌ ను విస్మరించారు. ఈ ఘటనతో ఆయన ప్రతిష్ట సైతం దెబ్బతిన్నది' అని పుస్తకంలో వినయ్‌ సీతాపతి పొందుపరిచారు. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరిగిన రాయబేరాలనూ అన్సారీ ప్రస్తావించారు. జేఎంఎం ఎంపీలకు ముడుపుల కుంభకోణాన్ని పేర్కొంటూ పీవీ జీవితంలో ఇది అత్యంత తప్పుడు నిర్ణయమని అన్నారు.

కాంగ్రెస్‌కు చెందిన వెట‌రనే నేత‌లు సైతం ఇదే వేదిక‌గా పీవీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం గ‌మ‌నార్హం. పీవీ హిందూ అనుకూల వైఖరి వల్లే అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ అన్నారు. బాబ్రీ అంశంలో ముందుచూపుతో వ్యవహరించాలని తాము సూచించినా ఆయన పెడచెవిన పెట్టారన్నారు.1992, డిసెంబర్‌ 6న బాబ్రీ విధ్వంస ఘటన పీవీ వైఫల్యమని నట్వర్‌ సింగ్‌ అభివర్ణించారు. కాంగ్రెస్ నాయ‌కుడిగా ఉన్న హ‌మిద్ అన్సారీని ఆ పార్టీ సార‌థ్యంలోని యూపీఏ ప్ర‌భుత్వం ఉప రాష్ట్రప‌తిగా నియ‌మించిన సంగ‌తి తెలిసిందే.