Begin typing your search above and press return to search.
ట్విట్టర్లో అన్సారీకా జిహాద్
By: Tupaki Desk | 11 Aug 2017 6:14 AM GMTఅవును, ముస్లింలకు అభద్రత ఉంది- ఇది ఉపరాష్ట్రపతిగా పదేళ్లు చేసిన అనంతరం వీడ్కోలు వేళ హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యానం. అన్సారీ కేవలం నేరుగా ఉపరాష్ట్రపతి అవలేదు. అంతకుముందు అతను దౌత్యవేత్త. పలు దేశాలకు భారత దౌత్య వేత్తగా వ్యవహరించిన సుదీర్ఘ అనుభవంతో ఆయన ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించి... రెండు దఫాలు కొనసాగారు. అయితే, పదవి దిగిపోయే ఒక్క రోజు ముందు ఆయన జీవితంలో ఏనాడూ చేయని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
నిజానికి ఆయన బాధ్యత కలిగిన పదవిలో ఉన్నపుడు ఈ మాట ఇంతకు ముందు అని ఉంటే అది ఆలోచించాల్సిన విషయంగా ఉండేది. కానీ పదవి దిగిపోయే రోజు చేయడంతో అతని అవకాశవాద రాజకీయాన్ని జనం దుమ్ము దులిపేశారు.
కలాం... ముస్లింగా పుట్టి ఇండియన్ గా ఉండటానికి ఇష్టపడ్డారు. అందుకే ఆయనకు శాంతి - సోదర భావం కనిపించింది. కానీ అన్సారీ ముస్లింగా పుట్టి ముస్లింగానే ఫీలవుతున్నారు. కాబట్టి... ఆయన మనసులో అశాంతి, అభద్రత ఉన్నాయని పలువురు ఆలోచించదగిన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇది కనుక మత పాత్రిపదికన కొనియాడే జాతీయ వాదాన్ని అవలంభించే దేశమైతే కనుక ముస్లిం అయిన అన్సారీ అంత ఉన్న పదువులు అలంకరించేవారా అన్నది జనం ప్రశ్న.
ఇంకా చెప్పాలంటే... ప్రపంచంలో ఏ లౌకిక దేశంలో కూడా ఇంత మంది మైనారిటీలు ఉన్నత పదవులు అలంకరించలేదు. ఈ సూక్ష్మవిషయాన్ని మరిచిపోయి ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు? అంటూ *అన్సారీకా జిహాద్* అంటూ హ్యాష్ టాగ్ పెట్టి ఆయనను ఏకిపడేశారు. ఉపరాష్ట్రపతి పదవికే కళంకం తెచ్చావు నువ్వు అని కొందరు అంటే, నిన్ను వీపీని చేసి మేము వీపీలు అయ్యాం అని కొందరు రియాక్టయ్యారు. ఇక్కడి ఉప రాష్ట్రపతి అనుభవంతో పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా పోటీ పడండి మీరు అని కొందరు వ్యాఖ్యానించారు. ఆయనకు పదవి భారతీయులు ఇస్తే, సేవ కాంగ్రెస్ కు చేశారు.. అని మరో వ్యాఖ్యానం పడింది.
అయితే, ఆయనకు మోడీ కూడా మంచి కౌంటరే వేశారు.... జీవితంలో రాయబారిగా పశ్చిమాసియాలోనే ఎక్కువగా పనిచేశారు. అలాంటి హద్దులు - వాతావరణం - వ్యక్తుల మధ్య చాలా కాలం గడిపేశారు. ఇక ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవించండి.. అని ఇన్ డైరెక్టుగా స్పష్టంగా కౌంటరిచ్చారు.