Begin typing your search above and press return to search.
పెద్దాయన హద్దు మీరారా?
By: Tupaki Desk | 10 Aug 2017 4:51 PM GMTఉప రాష్ట్రపతి పదవిని వీడుతున్న హమీద్ అన్సారీ ఆ హోదాలో తాను ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలపై కొత్త ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు కూడా స్పందించారు. రాజ్యసభ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్సారీ... భారత్ లో ముస్లింలలో అభద్రత - అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయని అన్నారు. దేశ పౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయమని వ్యాఖ్యానించారు.
జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదని, తాను భారతీయుడినేనని ఆయన అన్నారు. అన్సారీ వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యల పట్ల నూతన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలని విమర్శించారు. ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అన్సారీ వ్యాఖ్యలపై బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ తదితరులు కూడా మండిపడ్డారు. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని అన్నారు.