Begin typing your search above and press return to search.

హైకోర్టు తీర్పుల‌ పై ప్ర‌భుత్వం అస‌హ‌నం..సుప్రీంలో స‌వాల్‌ కు సిద్ధం!

By:  Tupaki Desk   |   25 May 2020 9:50 AM GMT
హైకోర్టు తీర్పుల‌ పై ప్ర‌భుత్వం అస‌హ‌నం..సుప్రీంలో స‌వాల్‌ కు సిద్ధం!
X
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం చీఫ్‌ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు స‌స్పెన్ష‌‌న్ వ్యవహారంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంది. స‌స్పెన్ష‌న్ తీవ్ర దుమారం రేప‌గా ఆ వ్య‌వ‌హారం హైకోర్టు దాకా చేరింది. ఈ స‌మ‌యంలో విచార‌ణ చేసిన అనంత‌రం హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ వెంటనే పోస్టింగు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ తీర్పు ప్ర‌భుత్వానికి భంగ‌క‌రంగా మారింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీంకోర్టు సవాల్ చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు సంబంధిత అధికారులు, ప్ర‌తినిధులతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్చించిన‌ట్లు సమాచారం.

సుప్రీంకోర్టులో రేపో మాపో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసే అవ‌కాశం ఉంది. ఇక ఈ కేసుతో పాటు మ‌రికొన్ని విష‌యాల‌పై కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుల‌పై సుప్రీమ్‌కు వెళ్లే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. ఏబీ స‌స్పెన్ష‌న్ వ్యవహారం సీఎం జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. ఈ స‌మ‌యంలో మ‌రోసారి అత‌డిపై స‌స్పెన్ష‌న్ ప‌డేలా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేలా న్యాయనిపుణుల‌తో ప్ర‌భుత్వం చ‌ర్చిస్తోంది. దీనిపై రెండు రోజుల్లో అత్యున్నత న్యాయస్థానంలో పిల్ వేస్తార‌ని చ‌ర్చ సాగుతోంది.

హైకోర్టు తీర్పు ఇచ్చినా ఇప్ప‌టివ‌ర‌కు ఏబీ వెంక‌టేశ్వ‌రరావుకు పోస్టింగ్ ఇవ్వ‌లేదు. హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు త‌గులుతుండ‌డం.. ప్ర‌భుత్వానికి వ్యతిరేక తీర్పులు రావ‌డంపై ముఖ్యమంత్రి జగన్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే హైకోర్టు తీర్పుల‌పై సుప్రీంకోర్టులో స‌వాల్ చేసేందుకు ఉన్న అవ‌కాశాలు ప‌రిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే సుప్రీంకోర్టులో వాటికి సంబంధించిన పిటిష‌న్‌లు దాఖ‌ల‌య్యే అవ‌కాశం ఉంది.