Begin typing your search above and press return to search.

త‌ప్పు రుజువైతే నా కొడుకును ఉరి తీయండి..!!

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:37 AM GMT
త‌ప్పు రుజువైతే నా కొడుకును ఉరి తీయండి..!!
X
కొన్ని ప‌రిణామాలు చోటు చేసుకునే తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఒక ప‌సికందును అత్యాచారం చేశాడన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు ఒక‌డు. అత‌ను ఆ త‌ప్పు చేసి ఉంటే.. ఏ మాత్రం క్ష‌మించ‌లేనిది. అయితే.. ఆ తప్పు చేసినోడు బీహారీ అయినందున‌.. గుజ‌రాత్ లో ఉన్న బీహారీల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న వైనం ఏ మాత్రం అర్థం లేనిది.

గ‌డిచిన కొద్దిరోజులుగా గుజ‌రాత్ లో దారుణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక చిన్నారిపై జ‌రిగిన అత్యాచారం నేప‌థ్యంలో త‌మ రాష్ట్రంలో ఉండే గుజ‌రాతీయేత‌రుల్ని టార్గెట్ చేసి మ‌రీ దాడులు చేస్తున్న వైనం షాకింగ్ గా మారాయి. ఈ నేప‌థ్యంలో అత్యాచార ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వాడి త‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రిలోనూ కొత్త ఆలోచ‌న‌లు రేకెత్తేలా చేయ‌ట‌మే కాదు.. గుజ‌రాతీయేత‌రుల‌పై దాడులు ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతోంది.

నెల క్రితం గుజ‌రాత్ లోని సాబ‌ర్ కాంఠా జిల్లాలో 14నెల‌ల ప‌సికందుపై బిహార్ కు చెందిన ఒక‌డు అత్యాచారం జ‌రిపిన‌ట్లుగా ఆరోప‌న‌లు ఉన్నాయి. నిందితుల్ని పోలీసులు వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాతి రోజు నుంచి గుజ‌రాత్‌ లోని ప‌లు జిల్లాల్లో హింస మొద‌లైంది. ఈ అత్యాచార ఉదంతాన్ని చూపిస్తూ.. గుజరాతీయేత‌ర వ్య‌క్తుల‌పై దాడులు జ‌ర‌గ‌టం. అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీంతో.. నాన్ గుజ‌రాతీయులు ప‌లువురు గుజ‌రాత్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. నిందితుడిగా ఉన్న వ్య‌క్తి త‌ల్లి ప్ర‌భావ‌తి దేవి తాజా ప‌రిణామాల మీద స్పందించారు. త‌ప్పు చేసింది త‌న కొడుకే అయితే.. అతడ్ని ఉరి తీయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. అంతేకాదు.. త‌ప్పు చేసినోడు నా కొడుకే అయినా ఉరి తీయండి.. అంతేకానీ నా కొడుకు కార‌ణంగా మిగిలిన బిహారీల‌ను శిక్షించొద్ద‌న్నారు.

ఇదిలా ఉంటే నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తి తండ్రి మాట్లాడుతూ.. త‌న కొడుకు మైన‌ర్ అని.. అత‌డి మాన‌సిక ప‌రిస్థితి స‌రిగాలేద‌ని.. ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్నాడ‌న్నారు. త‌మ‌కు న‌లుగురు సంతాన‌మైతే.. వాడు మూడోవాడ‌న్న ఆయ‌న‌.. రెండేళ్ల క్రితం ఎవ‌రికి చెప్ప‌కుండా స్నేహితుల‌తో క‌లిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా చెప్పారు. నిందితుడి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న త‌ల్లి చెప్పిన‌ట్లుగా.. ఎవ‌రో త‌ప్పుచేస్తే.. వాడి కులం వారిని.. వాడున్న ప్రాంతానికి చెందిన వారిని అనుమానించ‌టం.. శిక్షించాల‌నుకోవ‌టం ఆరాచ‌క‌మే అవుతుంది.