Begin typing your search above and press return to search.

మరోసారి నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా

By:  Tupaki Desk   |   2 March 2020 1:59 PM
మరోసారి నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా
X
జనవరి 22, ఫిబ్రవరి 1 - మార్చి3....నెక్స్ట్ ఏ తేదీ? ఇవన్నీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోన్నసినిమా విడుదల తేదీలు కాదు. సినీ థ్రిల్లర్ ను మరపిస్తూ....కొన `సాగు`తోన్న నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీలు. న్యాయ వ్యవస్థలో నిర్దోషుల కోసం కల్పించిన వెసులుబాటును దుర్విని యోగ పరుస్తున్న నిర్భయ కేసు దోషులు....తాజాగా మరోసారి తమ ఉరిశిక్షను వాయిదా వేయించు కోవడంలో సఫలమయ్యారు. దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నిర్భయ దోషుల ఉరిశిక్ష మరో సారి వాయిదా పడింది. అన్ని దారులు మూసుకుపోయి.... దాదాపు ఉరి ఖాయమనుకుంటున్న తరుణంలో....ఉరి శిక్ష వాయిదా పడింది. మరోసారి డెత్‌ వారెంట్లు ఇచ్చే వరకు ఉరి నిలుపుదల చేయాలని పటియాల హౌస్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

మూడో సారీ నిర్భయ దోషుల ఉరిశిక్ష అనూహ్యంగా వాయిదా పడింది. డెత్‌ వారెంట్ల పై స్టే ఇవ్వాలంటూ దోషి పవన్‌ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ పై పటియాల హౌస్‌ కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దోషులను ఉరి తీయ వద్దంటూ తీహార్‌ జైలు అధికారులకు పటియాల్ హౌస్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. మరోసారి డెత్‌ వారెంట్లు ఇచ్చే వరకు ఉరి నిలుపుదల చేయాలని పేర్కొంది. ఉరి శిక్ష అమలు పై మూడో సారి స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. పవన్‌ గుప్తా రాష్ట్రపతికి దాఖలు చేసిన క్షమాభిక్ష పటిషన్‌ను రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో దాదాపు ఉరితీత ఖాయమనుకున్నారు. ఈ క్రమంలోనే ఉరిశిక్ష మరోసారి వాయిదా పడటంతో నిర్భయ తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు.