Begin typing your search above and press return to search.
నిర్భయ దోషులని నేనే ఉరి తీస్తానంటున్న మీరట్ తలారీ!
By: Tupaki Desk | 8 Jan 2020 11:49 AM GMTనిర్భయ ఆత్మకి అతి త్వరలో శాంతి దొరకబోతుంది. ఆరుమంది కలిసి అమాయకమైన అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి , నడిరోడ్డు పై పడేసి వెళ్లిపోయారు. ఆ తరువాత హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాటం చేసిన నిర్భయ విధిని ఎదిరించలేక ప్రాణాలని వదిలేసింది. ఈ ఘటన జరిగినప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నిర్భయ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ , అమ్మాయిల పై జరిగే దారుణాలు మాత్రం ఆగడంలేదు. ఇక అప్పటినుండి ఏళ్ల తరబడి ఈనిర్భయ కేసు పై విచారణ జరుగుతూనే ఉంది. తాజాగా వీరికి ఉరి శిక్షని ఖరారు చేస్తూ పటియాలా హౌస్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తిహార్ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని తెలిపింది.
ఈ మేరకు దోషులు ముఖేశ్ , పవన్ గుప్తా , వినయ్ శర్మ , అక్షయ్ కుమార్ లకు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా డెత్ వారెంట్లు జారీ చేశారు. ఇకపోతే ఈ నలుగురు దోషులని ఉరి తీయడానికి తిహార్ జైలు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉరి తాళ్లను బక్సర్ జైలు నుండి తీసుకువచ్చారు. అయితే, ఈ నేపథ్యంలో ఉరి తాళ్ల తయారీకి బక్సర్ జైలే ఎందుకు కేంద్రంగా నిలుస్తోందన్న ప్రశ్నలు అందరిలో మొదలౌతున్నాయి. అయితే.. అందుకో కారణం ఉంది. బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలులో తప్ప ఉరితాళ్లను ఎక్కడా తయారుచేయకూడదనే నిబంధన ఉంది. బ్రిటీష్ పాలన నుంచే ఈ నిబంధన అమలులో ఉంది. అదే నిబంధన నేటికీ కొనసాగుతోంది.
గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే, పార్లమెంట్‌పై దాడులకు తెగబడ్డ అప్జల్ గురు, ముంబై టెర్రర్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాకుబ్ మెమన్, అజ్మల్ కసబ్, వీరంతా బక్సర్ జైలు నుంచి తయారైన ఉరితాళ్లతోనే ఉరి తీయబడ్డారు. 1884లో బ్రిటీష్ పాలకులు ఉరితాళ్లు తయారుచేసే యంత్రాన్ని బక్సర్ జైలుకు తీసుకొచ్చారు. అంతకు ముందు భారత్‌లో ఉరితీయాలంటే ఫిలిఫ్పైన్స్ రాజధాని మనీలా నుంచి ఉరితాళ్లను దిగుమతి చేసుకునేవారు. బక్సర్ జైలుకు యంత్రాన్ని తీసుకొచ్చాక ఇండియా ఫ్యాక్టరీస్ యాక్ట్ ను అమలు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం కేవలం బక్సర్ జైలుకు మాత్రమే ఉరితాళ్లను తయారుచేసే అనుమతినిచ్చింది.
ఇకపోతే , మరో విషయం ఏమిటంటే ..గత కొన్ని ఏళ్లుగా భారత్ లో ఉరి శిక్ష పడ్డ ప్రతి దోషిని కూడా పవన్ కుటుంబానికి చెందివారే ఉరి శిక్షని అమలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ నిర్భయ దోషులని కూడా నేనే ఉరి తీస్తా అంటూ మీరట్ జైలు తలారీ పవన్ జల్లాద్ అన్నారు. అయితే.. తిహార్ జైలు అధికారులు ఇప్పటి వరకు తనకు ఈ విషయంపై ఎలాంటి సమాచారం అందజేయలేదని తెలిపారు. పవన్ జల్లాద్ ప్రస్తుతం దేశంలో ఉన్న ఏకైక తలారీ కావడంతో నిర్భయ హంతకుల ఉరిశిక్ష అమలు అతడి చేతుల మీదుగానే జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. పవన్ ముత్తాత లక్ష్మణ్ రామ్ బ్రిటిష్ కాలంలో మీరట్ జైలులో తలారీగా పనిచేసేవారు. ఈయనే భగత్‌సింగ్ ను ఉరితీసాడు. తర్వాతి కాలంలో పవన్ తాత కల్లూ జల్లాద్ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఇందిరాగాంధీ హత్యకేసులో సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ను ఉరి తీసాడు.