Begin typing your search above and press return to search.

హనుమాన్ చాలీసా వివాదం...: నవనీత్ కౌర్ దంపతులకు హైకోర్టు షాక్..

By:  Tupaki Desk   |   26 April 2022 12:33 PM IST
హనుమాన్ చాలీసా వివాదం...: నవనీత్ కౌర్ దంపతులకు హైకోర్టు షాక్..
X
మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం రచ్చవుతోంది. ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముందు ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసిరారు. దీంతో వారిని శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత వారిని అరెస్టు చేశారు. అయితే ఆ తరువాత కోర్టుకు, ఆ పై లోక్ సభ స్పీకర్ వరకు ఈ వివాదం వెళ్లింది. చివరకు ఎంపీ నవనీత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పందించింది. మహారాష్ట్ర కు నోటీసులు జారీ చేసింది. అయితే హనుమాన్ చాలీసా చదవడానికి ఒక పద్దతి ఉంటుందని, కానీ ఎంపీ చేసిన విధానంపైనే చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.

మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు. మహారాష్ట్రలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా పేరు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె భర్త కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అలజడి రేపినట్లయింది.

దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. హైడ్రామా వద్ద పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ తరువాత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేసు నమోదు చేశారు. మరోవైపు సీఎం ఇంటిముందు ఎలాంటి అలజడి సృష్టించే కార్యాక్రమాలు చేపట్టొద్దని శివసేన నాయకులు చెబుతున్నారు.

ఎంపీ స్థానంలో ఉన్న తనను పోలీసులు అరెస్టు చేశారని, తననై నమోదైన కేసును కొట్టివేయాలని నవనీత్ కౌర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.అయితే అక్కడ ఎంపీకి చుక్కెదురైంది. ఒక సీఎం ఇంటిముందు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసరడం కరెక్ట్ కాదని వారించింది.

అంతేకాకుండా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి పనులు చేయొద్దని తెలిపింది. దీంతో వారు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత నవనీత్ కౌర్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసరడం తప్పని హైకోర్టు కూడా ఎంపీ దంపతులకు షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా పోలీసులు తనను వేధించారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ లేఖ రాశారు. ఈ లేఖపై పార్లమెంట్ సెక్రటెరియేట్ స్పందించింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. దీంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే ఈ వివాదంపై స్పందించారు. హిందుత్వం గురించి తమకు ఎవరు కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. హనుమాన్ చాలీసాను సరైన సమయంలో.. సరైన ప్రదేశంలో పఠించాలని అన్నారు. ఎక్కడపడితే అక్కడ చదివి అపహస్యం చేయొద్దన్నారు.