Begin typing your search above and press return to search.

పవన్ వారాహి వాహనం నంబర్ TS 13EX 8384

By:  Tupaki Desk   |   12 Dec 2022 3:38 PM GMT
పవన్ వారాహి వాహనం నంబర్ TS 13EX 8384
X
గత కొద్దిరోజులుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచార రథం ‘వారాహి’పై వివాదం చెలరేగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు వారాహి రంగు, రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధం అంటూ రాజకీయంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పవన్ వాహనానికి మిలటరీ రంగు వేయడం.. వాహన రిజిస్ట్రేషన్ చట్టానికి అనుగుణంగా వాహనం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో దీని రిజిస్ట్రేషన్ కు వైసీపీ ప్రభుత్వం చేయదన్న ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం ట్రాఫిక్, వాహనచట్టాల ఉల్లంఘన కిందకు వస్తుందని ఇది వరకే వాదన మొదలుపెట్టారు. . ఆయన వాహనానికి వేసిన రంగు ఆలివ్ గ్రీన్ మిలటరీవారు మాత్రమే వినియోగిస్తారని.. రక్షణరంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేటు వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోనూ అక్కడి ప్రభుత్వం ఇదే అంశంపై ఉత్తర్వులు జారీ చేసింది. ఆలివ్ గ్రీన్ లో ఉన్న వాహనాలు వెంటనే రంగు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇప్పుడు పవన్ వాహనం కూడా ఇదే రంగులో ఉండడంతో ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ కాదని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఆరోపించారు.. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రక్రియ పూర్తికాలేదు. వాహన రిజిస్ట్రేషన్ సమయంలో దీనిపై అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ఏపీలో కాకుండా తెలంగాణలో ఈ వాహన రిజిస్ట్రేషన్ చేయించారు. తాజాగా వారాహికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు స్వయంగా వెల్లడించారు. ‘వారాహి’ వాహనానికి రవాణాశాఖ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు ఉన్నాయని.. వారాహి వాహనం రంగు ‘ఎమరాల్డ్ గ్రీన్’ అని స్పష్టం చేశారు. వాహనం బాడీ తయారీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని.. అన్ని నిబంధనలు ఉన్నాయని.. వాహనం రిజిస్ట్రేషన్ కు చట్ట ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని కమిషనర్ తెలిపారు.

ఇక వారాహి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ TS 13 EX 8384 అని నంబర్ కూడా కేటాయించినట్టు కమిషనర్ వెల్లడించారు. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం ఒట్టి తప్పు అని అర్థమైంది. వైసీపీ విమర్శలకు చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ తాజాగా వారాహి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం సంచలనమైంది. కమిషనరే స్వయంగా ఈ విషయాన్ని తెలుపడంతో వైసీపీ నేతల విమర్శలకు గట్టి ఝలక్ తగిలినట్టైంది.

వైసీపీ వాహనం రంగు, రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో జనసేన కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడేమంటారు అంటూ జనసైనికులు వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు.

వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ తయారు చేయించిన వాహనానికి ‘వారాహి’ అని నామకరణం చేశాడు. వారాహి బస్సులోనే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయనున్నారు. ఇందులో ఎన్నో అత్యాధునిక హంగులు, వసతులు కల్పించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసిన అనంతరం వాహనం వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఇదే వాహనంపైన వివాదం రాజుకుంది. మిలటరీ వెహికల్ టైపులో పవన్ ప్రచారం రథం కనిపించడంతో కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ ఏకంగా అనుమతించి నంబర్ కూడా కేటాయించడం చర్చనీయాంశమైంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.