Begin typing your search above and press return to search.
ప్రవాసులకు అమెరికా హ్యాపీ న్యూస్.. ఏడేళ్లు ఉంటే గ్రీన్ కార్డు!
By: Tupaki Desk | 30 Sep 2022 4:25 AM GMTభూతల స్వర్గంగా.. డాలర్ డ్రీమ్స్ కు అల్టిమేట్ డెస్టినేషన్ గా చెప్పుకునే ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే అవకాశం రావటమే ఒక లక్ గా పలువురు అభివర్ణిస్తారు. ఇక.. ఆ దేశ శాశ్విత సభ్యత్వం సొంతమైతే అంతకు మించిన గ్రేట్ అఛీవ్ మెంట్ మరొకటి ఉండదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆ అంశానికి సంబంధించి కీలక అప్డేట్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఇప్పుడున్న నిబంధనల్ని తీసి తుక్కుబుట్టలో పడేసి.. ఏడంటే ఏడేళ్లు అమెరికాలో ఉంటే చాలు.. పర్మినెంట్ రెసిడెంట్ గా ఉంటే అద్భుత అవకాశాన్ని అమెరికాలో ఉండే విదేశీయులకు వచ్చేందుకు వీలు కల్పించే కీలక బిల్ ఒకటి తాజాగా అమెరికా సెనెట్ లో పెట్టారు.
అమెరికాలోని అధికార పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ సెనేటర్లు ఈ బిల్ ను ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్విత నివాస హోదా కోసం చాలాకాలంగా నిరీక్షిస్తున్న వారందరికి పండుగ చేసుకునేలా ఈ బిల్లు మారుతుంది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే.. అందరికంటే ఎక్కువగా లాభం పొందే వారిగా ప్రవాస భారతీయులు మారుతారు.
హెచ్ 1బీ వీసాతో పాటు.. దీర్ఘకాల వీసాలపై అమెరికాలో ఉండే భారతీయులకు ఈ బిల్ భారీ ఉపశమనంగా మారటం ఖాయం. అమెరికాలో నివసించే లక్షలాది మంది వలసదారులు శాశ్వత నివాస హోదాను సొంతం చేసుకోవటానికి అర్హత సాధిస్తారు. ఈ కీలక బిల్లును డెమోక్రటిక్ సెనేటర్ అలెక్స్ పాడిల్లా సభలో ప్రవేశ పెడితే.. దీనికి ఎలిజిబెత్ వారెన్.. బెన్ రే లుజన్.. డిక్ డర్బిన్ లు బలపర్చారు.
పాత ఇమ్రిగేషన్ విధానం కారణంగా లక్షలాది మంది వలసదారులు నష్టపోయారని.. వీరంతా దశాబ్దాలుగా అమెరికాలో నివిస్తూ.. దేశం కోసం పని చేసినట్లుగా బిల్లులో పేర్కొన్నారు. దేశాన్ని డెవలప్ చేసే విషయంలో సహకరిస్తున్న వారికి అమెరికాలో స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించకపోవటం కారణంగా దేశం కూడా నష్టపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏడేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారందరికి గ్రీన్ కార్డులు మంజూరు చేస్తే.. మరింత మంది వలసదారులు చట్టబద్ధమైన నివాస హక్కు కోసం అప్లై చేసుకోవటానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం శాశ్విత నివాస హోదా కోసం హెచ్ 1బీ వీసాలతో అమెరికాకు వెళ్లిన వారు ఏళ్లకు ఏళ్లుగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ కీలక బిల్ ఆమోదం పొందితే.. వలసదారులందరికి ఆనందమే ఆనందమని.. వారికి అదే అసలైన పెద్ద పండుగగా మారుతుందని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.