Begin typing your search above and press return to search.

నేను ప్ర‌ధాని అయ్యే చాన్స్ లేదు..ప్లీజ్ వ‌దిలేయండి

By:  Tupaki Desk   |   21 Dec 2018 10:10 AM GMT
నేను ప్ర‌ధాని అయ్యే చాన్స్ లేదు..ప్లీజ్ వ‌దిలేయండి
X
2019 సాధారణ ఎన్నికల బ‌రిలో దిగే స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌ధాన‌మంత్రి నరేంద్రమోదీ స్థానంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌ - పార్టీ మాజీ అధ్య‌క్షుడు నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు లేఖ రాసినట్లు కథనాలు వస్తున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాలంటే తప్పనిసరిగా నితిన్ గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. ఈ కథనాలపై నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. తాను ప్రధానమంత్రి అయ్యే ఛాన్సే లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుతమున్న పదవితో తాను సంతోషంగా ఉన్నానని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన‌ నితిన్ గడ్కరీ ఆయన తేల్చిచెప్పారు. గంగా ప్రక్షాళన చేయడం - ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించడం - చార్ ధామ్ కోసం రోడ్డు మార్గం నిర్మించడంతో పాటు పలు పనులు చేయాల్సి ఉందన్నారు గడ్కరీ. ఈ పనులతో తాను సంతోషంగా ఉన్నానని.. ఇతర పనులు పూర్తి చేయాల్సి ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. రోడ్డు - రైల్వే - విమానయాన రంగంలో ఈశాన్య రాష్ర్టాల్లో గడిచిన నాలుగున్నరేండ్లలో చాలా అభివృద్ధి చేశామన్నారు. రూ. 2.50 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే.. ఈశాన్య రాష్ర్టాల ముఖచిత్రం మారిపోతోందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.