Begin typing your search above and press return to search.

జాతీయ రాజకీయంపై బెట్టింగులు ఇలా!

By:  Tupaki Desk   |   26 April 2019 7:24 AM GMT
జాతీయ రాజకీయంపై బెట్టింగులు ఇలా!
X
ఎన్నికలు వస్తే బెట్టింగ్ రాయుళ్లకు పండుగే. తమ అభ్యర్థిదే విజయం.. మా పార్టీయే అధికారంలోకి వస్తుందని భారీ మొత్తంలో బెట్టింగ్ వేస్తుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా కేంద్రంలో భారీగా బెట్టింగులు కాస్తున్నట్లు సమాచారం. హాపూర్ జిల్లా కేంద్రంలోని సత్తా బజార్ బెట్టింగ్లకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పవచ్చు.

సత్తా బజార్ లోని బెట్టింగ్ అంచనాలు దాదాపు నిజం అవుతాయని నమ్మకం. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సత్తా బజార్ లో చాలా వరకు మోదీ ప్రభుత్వంపై బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి బెట్టింగ్ అంచనాలపై నమ్మకం ఉంది. ఫలితంగా గత 2014 ఫలితాల ఆధారంగా బెట్టింగ్ కాస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు.. ఏ పార్టీది విజయం.. ఏ స్థానంలో ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

బెట్టింగ్ వీటిపైనే..

– మోదీ మరోసారి అధికారంలోకి వస్తారు.
– యూపీలో 71 నుంచి 40 సీట్లకు బీజేపీ
– గత 2014 ఎన్నికల కంటే తగ్గిన మోదీ హవా
– దేశవ్యాప్తంగా బీజేపీకి సుమారు 240 స్థానాలు
– మిత్రపక్షాలతో కలిసి మరోసారి ఎన్డీయేకే అధికారం
– వారణాసిలో ప్రధాని మోదీ ఘన విజయం సాధిస్తారు.
– శివసేన - జేడీయూ నుంచి బీజేపీకి మద్దతు అనుమానమే.. అనే కోణంలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు సమాచారం.

రాజకీయ విశ్లేషకుల సమాధానం..

ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లా కేంద్రంలోని సత్తా బజార్ లో జరిగే బెట్టింగ్ లో దాదాపు అవే ఫలితాలు ఖరారు కానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఈసారి ఎన్నికల్లో మోదీ హవా తగ్గిందని చెప్పవచ్చు. మోదీ తన ప్రసంగాలతో ఎంత రెచ్చగొట్టినా.. 2014 ఫలితాలు పునరావృతం కావడం కష్టంగా ఉందని చెబుతున్నారు. అయితే మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శివసేన - జేడీయూ నుంచి బీజేపీకి మద్దతు ఉంటుందా? లేదా? అనేది కష్టమని తేల్చారు. గత 2014లో యూపీలోని 80 స్థానాలకు గానూ బీజేపీ 71 చోట్ల విజయం సాధించింది. అయితే ఈసారి 40 - 45 స్థానాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ గత 2014లో 283 సీట్లు సాధించింది. అయితే ఈసారి 240 వరకు రావచ్చని అంచనా.