Begin typing your search above and press return to search.
బీజేపీకి షాక్.. కేంద్రమంత్రి పదవికి హర్ సిమ్రత్ రాజీనామా
By: Tupaki Desk | 17 Sep 2020 5:35 PM GMTకేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై ఇప్పటికే దేశంలోని పలువురు సీఎంలు గళమెత్తారు. కేంద్రం విద్యుత్ చట్టంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేరళ, బెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు కూడా బీజేపీ తీరును ఎండగట్టారు. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కూడా వ్యతిరేకిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్రంలో భాగస్వామిగా ఉన్న శిరోమణి ఆకాలీదళ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అకాలీదళ్ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ కౌర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని కార్యాలయానికి చేరుకొని హర్ సిమ్రత్ తన రాజీనామా సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధ బిల్లులను నిరసిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన ఈ బిల్లుల విషయంలో ప్రభుత్వం నిర్ణయంను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఏకంగా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగడం దేశ రాజకీయాల్లో సంచలనమైంది.
ఇక పార్లమెంట్ లో రెండు వ్యవసాయ బిల్లులకు సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేయాలని అకాలీదళ్ నిర్ణయించింది. బిల్లులకు నిరసనగా మంత్రి పదవులు కూడా వదులుకుంది. ప్రభుత్వం నుంచి బయటకొచ్చినా ఎన్డీఏలోనే కొనసాగాలనుకుంటున్నట్టు సమాచారం.
అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్ బీర్ సింగ్ బాదల్ భార్య హర్ సిమ్రత్ కౌర్. భటిండా నుంచి ఎంపీగా గెలిచారు. మోడీ కేబినెట్ లో రెండోసారి కేంద్రమంత్రి చేపట్టారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు.