Begin typing your search above and press return to search.
స్నేహితుడి భార్యను ఫోన్ లో వేధించాడు.. చివరకు ఏమైందంటే?
By: Tupaki Desk | 8 March 2022 4:23 AM GMTఅతిగా ఆశపడే మగాడికి దక్కేదేంటో.. ఆ సినిమా డైలాగ్ చెప్పేసింది. వాస్తవం కూడా అలానే ఉంటుందన్న విషయం తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే ఇట్టే అర్థమవుతుంది. స్నేహితుడి భార్యను తప్పుగా చూస్తూ.. ఆమెను వేధిస్తూ.. ఫోన్లో నరకం చూపిస్తున్న ఒకడి రాక్షసత్వం ఆమె ప్రాణాలు పోయేలా చేసింది.
ఇంత జరిగిన తర్వాత ఎవరికి ముఖం చూపించలేక తాను చచ్చిపోయిన ఉదంతం మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో తప్పు చేసినోడికే కాదు.. ఏ మాత్రం తప్పు లేకున్నా.. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రాణాలు తీసుకున్న వైనం తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం. అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లాలోని ముత్యంపేట గ్రామానికి చెందిన 24 ఏళ్ల మౌనిక.. ఈ నెల 5న పురుగులు మందు తాగి.. వాంతులు చేసుకుంటూ ఇంట్లోనుంచి బయటకు వచ్చింది. ఇంటి బయట కూర్చున్న భర్త.. అత్తకు ఏం జరిగిందో అర్థం కాక ఆమెను హుటాహుటిన లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎందుకిలా చేసింది? అన్నది ప్రశ్నగా మారింది. భర్త నుంచి కానీ అత్త నుంచి కానీ ఆమెకు ఎలాంటి సమస్యలు లేవు. ఇద్దరు కుమార్తెలతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబానికి శాపంగా మారింది భర్త స్నేహం.
భర్త స్నేహితుడు.. అదే గ్రామానికి చెందిన 28 ఏళ్ల ప్రశాంత్.. ఆమెను విపరీతంగా వేధించేవాడు. ఫోన్లో ఆమెను తెగ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో.. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఆమె.. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు పరిస్థితి విషమించిందనన మాటతో.. కరీంనగర్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సోమవారం ఆమె మరణించింది. మౌనిక తల్లి సుగుణ కంప్లైంట్ తో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ దారుణానికి కారణమైన ప్రశాంత్ కు తీరని అవమానంగా మారింది. స్నేహితుడి భార్యను ఫోన్లో వేధించటం.. ఆమె ఆత్మహత్యకు కారణం కావటంతో తీవ్ర అవమాన భారానికి గురయ్యాడు. తాను చేసిన పనితో ఎవరి ముందు తలెత్తలేని పరిస్థితి రావటంతో.. సోమవారం రామగుండం దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లై బుద్దిగా కాపురం చేసుకోకుండా.. స్నేహితుడి భార్యను ఇబ్బంది పెట్టి ఆమె ప్రాణాల్ని తీయటమే కాదు.. తాను ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే.. అతిగా ఆశ పడటం ఏ మాత్రం మంచిది కాదన్న నూటికి నూరు శాతం నిజం.