Begin typing your search above and press return to search.
డీఎస్ కుమారుడిపై లైంగిక ఆరోపణలు..?
By: Tupaki Desk | 2 Aug 2018 3:28 PM GMTమాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంటుగా పనిచేసి ఆ తరువాత టీఆరెస్ లోకి వచ్చిన సీనియర్ లీడర్ డీఎస్ ను అదే టీఆరెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందన్న విమర్శలు వస్తున్నాయి. టీఆరెస్ లోకి వచ్చినా తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఇమడలేకపోతున్న డీఎస్ బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారం కొద్దికాలంగా ఉంది. దీనిపై కొద్ది రోజులుగా డీఎస్ - టీఆరెస్ మధ్య రగడ జరుగుతోంది. డీఎస్ కుమారుల్లో ఒకరైన అరవింద్ బీజేపీలో చేరారు. అంతేకాదు... నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. నిజామాబాద్ ఎంపీగా కేసీఆర్ కుమార్తె కవిత ఉన్నారు. దీంతో... డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కవిత బాహాటంగానే విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ కు టీఆరెస్ కు సంబంధాలు దాదాపు తెగిపోయాయి.
ఇదంతా ఇలా ఉంటే... తాజాగా డీఎస్ మరో కుమారుడు - నిజామాబాద్ మాజీ మేయర్ అయిన సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విద్యాసంస్థలకు అధిపతి అయిన సంజయ్ తన కాలేజీల్లో చదివే అమ్మాయిలను లైంగికంగా హింసిస్తున్నారంటూ 11 మంది విద్యార్థినులు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. వీరు పీడీఎస్ యూ నేత సంధ్యను కలవగా.. అక్కడి నుంచి హోమంత్రిని కలిశారు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని హోమంత్రి చెప్పారు.
సంజయ్ నిర్వహించే కాలేజీ విద్యార్థులు ఇలాంటి ఆరోపణలు గతంలోనూ చేశారు. ఆయనపై ఇలాంటి ఆరోపణలు నిజామాబాద్‌లో బాగా వ్యాప్తిలో ఉన్నాయి. అయితే... ఇప్పుడు ఒకేసారి ఇంతమంది అమ్మాయిలు బయటకొచ్చి హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేయడం వెనుక రాజకీయ అంశాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమ్మాయిలు లైంగిక హింసకు గురికావడం బాధాకరమే అని.. నిందితులను శిక్షించడం తప్పనిసరి అని అంటూనే నిజామాబాద్ ప్రజలు ఇందులో రాజకీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆరెస్ లో ఉంటూనే కవితకు పోటీగా కొడుకును పోటీ దించేందుకు ప్రయత్నించడంతోనే డీఎస్‌పై ఉచ్చు బిగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.