Begin typing your search above and press return to search.

లైంగికవేధింపుల కేసు..సీజేకు కష్టకాలం

By:  Tupaki Desk   |   5 May 2019 10:35 AM GMT
లైంగికవేధింపుల కేసు..సీజేకు కష్టకాలం
X
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. లైంగిక ఆరోపణలు చేసిన మహిళను కలుపుకోకుండా చీఫ్ జస్టిస్ లైంగిక వేధింపుల కేసును విచారించడం సరికాదంటూ అంతర్గ విచారణ కమిటీకి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్ తేల్చిచెప్పారు.

ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారీమన్ లు సమావేశమై చీఫ్ జస్టిస్ పై వేసిన విచారణ కమిటీ జడ్జీలకు చర్చించనట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏకపక్ష విచారణ వల్ల సుప్రీం కోర్టు ప్రతిష్ట దెబ్బతింటుందని.. మహిళను భాగస్వామిగా చేర్చి విచారించాలని కోరడంతో చీఫ్ జస్టిస్ ఇరుకునపడ్డారు.

ఈ మేరకు జస్టిస్ నారీమన్.. ఆరోపించిన మహిళకు లాయర్ ను పెట్టుకునేందుకు అనుమతించాలని లేదా అమికస్ క్యూరీనైనా ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్గత విచారణకు వచ్చేందుకు ఆరోపించిన మహిళ ఉద్యోగి నిరాకరించారు. దీంతో సీజేపై ఆమె చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది.

ఇక సీజేపై ఆరోపణల విషయంలో తనకు లాయర్ ను పెట్టుకోవడానికి.. న్యాయ సలహాదారును పెట్టుకునేందుకు అనుమతించలేదని ఆమె ఆరోపించింది.