Begin typing your search above and press return to search.
బజ్జీ బంతాట... సెలక్టర్లకు సంకేతాలు!
By: Tupaki Desk | 13 April 2015 3:59 AM GMTఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ గెలిచినా, ఓడినా చాలా చర్చలు నడుస్తుంటాయి. కానీ ఆదివారం రాత్రి జరిగిన ముంబై ఇండియన్స్ - పంజాబ్ మ్యాచ్ లో మాత్రం గెలుపోటముల గురించి కాకుండా హర్భజన్ సింగ్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రపంచకప్ లో తనను సెలక్ట్ చేయలేదనే కసి బజ్జీ కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. తన ఫెర్మార్మెన్స్ తో టీం ఇండియా సెలక్టర్లకు బ్యాట్ తో కూడా సంకేతాలు ఇచ్చాడు. బౌలింగ్ లో 4 ఓవర్లకు 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్న బజీ... బ్యాటింగ్ లో కూడా ఊహించని రీతిలో బాదుడు బాదాడు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్... కెప్టెన్ బెయిలీ (61 - 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు), సెహ్వాగ్ (36 - 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ల సాయంతో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. 178 పరుగుల విజయలక్ష్యం తో బ్యాటింగ్ ఆరంభించిన ముంబయి జట్టు... ఆరంభంలో తడబడింది. ఒక దశలో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అప్పుడు బ్యాటింగ్ కు దిగాడు బజ్జీ... ఏమి చేస్తున్నాడో ఎలా చేస్తున్నాడో ఎలా ముగిస్తాడొ తెలిసేలోపు 24 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీటిలో 5 ఫోర్లు ఉండగా, 6 సిక్స్ లు ఉన్నాయి. ఘన విజయం ఖాయం అనుకున్న పంజాబ్ ను కాస్త కంగారు పెట్టినా... ఫలితం పంజాబ్ వైపే మొగ్గు చూపింది. కానీ... బజ్జీ తన భీకర ఇన్నింగ్స్ తో తదుపరి మ్యాచ్ లలో తలపడే టీం లకు బలమైన సంకేతాలే ఇచ్చాడు. ఫైనల్ గా ఆ మ్యాచ్ లో ముంబయి ఓడినా... పంజాబ్ గెలిచినా... బజ్జీ హీరోగా నిలిచాడు!