Begin typing your search above and press return to search.

భజ్జీ పెళ్లి విందులో బజ్జీలు లేవు

By:  Tupaki Desk   |   1 Nov 2015 10:03 AM GMT
భజ్జీ పెళ్లి విందులో బజ్జీలు లేవు
X
ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్(భజ్జీ)కు మొన్నే పెళ్లయిన సంగతి తెలిసిందే. ఆయన తన ప్రియురాలినే వివాహమాడారు.. అయితే... సాధారణంగా సెలబ్రిటీ పెళ్లిళ్లలో విందులపై చర్చలు జరుగుతాయి. కానీ, భజ్జీ పెళ్లి సందర్భంగా విందులో పెట్టిన వంటకాల కంటే కూడా ఇంకో అంశం ప్రధానాకర్షణగా మారింది. అది ఆకర్షణే కాకుండా వివాదంగానూ మారింది.

ప్రముఖ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ పెళ్లి సందర్భంగా 113 రకాల పొగాకు ఉత్పత్తులను వినియోగించారట. పెళ్లికొచ్చినవారంతా సంబరంగా వీటిని ఆస్వాదించగా కొన్ని సిక్కు సంస్థలు మాత్రం దీనిపై మండిపడుతున్నాయి. ఈ మేరకు ఆ సంస్థలు హర్భజన్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వివాహ వేడుకల్లో అతిథులకు పొగాకు - హుక్కా మొదలైనవి అందించడం పట్ల సిక్కు సంస్థలు ఆగ్రహానికి గురయ్యాయి. హర్భజన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థలు డిమాండ్‌ చేశాయి.

ఉత్తరాదిలో బడాబాబుల వివాహాల్లో మద్యం - పొగాకు ఉత్పత్తులు కూడా ప్రాధాన్యాంశమే. విందులో వంటకాల గురించి ఎంత జాగ్రత్తలు తీసకుంటారో... ఎంత గొప్పగా చేయాలనుకుంటారో అదేవిధంగా మద్యం - పొగాకు ఉత్పత్తుల విషయంలోనూ వ్యవహరిస్తారు. ఖరీదైన మద్యం దాదాపుగా మంచి బ్రాండ్లన్నీ అందుబాటులో ఉంచుతారు. అలాగే పొగాకు ఉత్పత్తులైన వివిధ రకాల కాస్ట్ లీ సిగరెట్లు - సిగార్లు - నమిలేవి అన్నిరకాలు పెళ్లి వేడుకకు వచ్చిన వారికి అందిస్తారు.

భజ్జీ పెళ్లిలో కూడా ఇలాగే బజ్జీలు వంటివి పెట్టకపోయినా 113 రకాల పొగాకు ఉత్పత్తులు మాత్రం ఇచ్చారట. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిక్కు సంస్థలు ఇప్పుడు సిక్కు మత అత్యున్నత పీఠమైన అఖల్‌ తఖ్త్‌ కు కూడా ఫిర్యాదు చేయాలనుకుంటున్నాయి.