Begin typing your search above and press return to search.
భజ్జీకి చుక్కలు చూపించిన హైదరాబాద్ హోటల్!
By: Tupaki Desk | 13 May 2019 7:31 AM GMTచక్కటి అతిథ్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందన్న హైదరాబాద్ పేరుకు డ్యామేజ్ కలిగే ఉదంతంగా చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్.. టీమిండియా జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తాజాగా చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన టీం సభ్యులకు ఐటీసీ కాకతీయ అతిధ్యాన్ని అందించింది.
అయితే.. తమకు సర్వ్ చేసిన ఫుడ్ మీద కంప్లైంట్ చేశారు భజ్జీ. తమకిచ్చిన ఆహారం ఏ మాత్రం బాగోలేదని.. దీనిపై కంప్లైంట్ చేసినా హోటల్ సిబ్బంది పట్టించుకున్నది లేదని పేర్కొన్నారు. తమ మాటల్ని రిసెప్షన్ కూడా స్పందించలేదన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్స్ తో స్టే చేయటానికి తాను ఇష్టపడతాను కానీ ఐటీసీ కాకతీయ హైదరాబాద్ లో బస చేయటానికి మాత్రం తాను మక్కువ చూపడనున్నారు. ఆహారాన్ని వండిన పద్దతి ఏ మాత్రం బాగోలేదన్నారు. ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్కరూ స్పందించింది లేదన్నారు. డ్యూటీ మేనేజర్ మొదలు రూం సర్వీస్ చేసిన వారి వరకూ ఎవరికి పట్టలేదని.. అదేమంటే.. తాము అతిధులకు సేవ చేయటంలో బిజీగా ఉన్నట్లు చెప్పినట్లుగా పేర్కొన్నారు.
ప్రముఖ క్రికెటర్ గా పేరున్న భజ్జీ విషయంలోనే హోటల్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మామూలోళ్లు వెళితే అస్సలు పట్టించుకుంటారా? భజ్జీ ట్వీట్ పై ఐటీసీ హోటల్స్ టాప్ లెవల్ ఏ రీతిలో రియాక్ట్ అవుతుందో చూడాలి.