Begin typing your search above and press return to search.
భజ్జీ డబ్బు కంటే కుటుంబానికే ఎక్కువ విలువనిస్తాడు !
By: Tupaki Desk | 5 Sep 2020 11:30 PM GMTఐపీఎల్ .. చాలా గ్యాప్ తరువాత , ఎన్నో అనూహ్య మలుపుల మధ్య ఎట్టకేలకి ప్రారంభానికి సిద్ధం అవుతుంది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2020 ప్రారంభం అవుతుంది అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. మొదట కరోనా కలకలం రేపింది. ఆ తర్వాత రైనా, హర్భజన్ లు ఈ సీజన్ నుండి తప్పుకున్నారు. సురేష్ రైనా విషయంలో కారణాలు ఏంటనేది ఇప్పటికీ క్లారిటీగా తెలియకపోయినా.. లీగ్ మధ్యలోనైనా జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తానే స్వయంగా వెల్లడించాడు.
ఇక హర్భజన్ .. తల్లి అనారోగ్యం దృష్యా, వ్యక్తిగత కారణాల రిత్యా తాను కుటుంబంతో సమయం గడపాల్సి ఉందని, అందుకే లీగ్‌కు కూడా దూరమవుతున్నట్లు తెలిపాడు. అయితే , కొందరు మాత్రం కరోనాకి భయపడి హర్భజన్ ఈ సీజన్ నుండి తప్పుకున్నాడు అంటూ విమర్శలు చేశారు. దీనిపై హర్భజన్ స్నేహితుడొకరు ఘాటుగానే స్పందిస్తూ.. భజ్జీ విషయమై క్లారిటీ ఇచ్చాడు. కేవలం వ్యక్తిగత కారణాల రిత్యా హర్భజన్ ఈ ఐపీఎల్ లో పాల్గొనడం లేదు. అంతేకానీ దుబాయ్‌లో ఉన్న పరిస్థితులు దృశ్యా అతను దూరమవలేదు. ఐపీఎల్ 13వ సీజన్ ఆడేందుకు భజ్జీ జట్టుతో పాటు దుబాయ్ కు వెళ్లలేదు. తల్లి అనారోగ్యం దృష్యా ఫ్యామిలీతో గడపాలనే నిర్ణయంతో గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు.
ఈ సమయంలో అతను ఐపీఎల్ ఆడినా ఆట మీద ఎక్కువ ఫోకస్ చేయలేడు. అందుకే తనకు కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ భజ్జీ ఐపీఎల్ ఆడితే రెండు కోట్లు దక్కుతాయి.. కానీ అది 2 కోట్లా లేక 20 కోట్లా అన్నది ముఖ్యం కాదు.. ఎందుకంటే భజ్జీ దృష్టిలో డబ్బు అనేది చివరి ఆప్షన్.. కుటుంబ విలువవలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు అంటూ విమర్శకుల నోర్లు మూయించాడు. ఇకపోతే , 2008 నుంచి 2017 వరకు పది సీజన్ల పాటు హర్భజన్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.2018లో చెన్నై జట్టులోకి వచ్చిన అతను టీమ్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది రన్నరప్‌గా నిలవడంలో కూడా భజ్జీ పాత్ర ఉంది. ఓవరాల్‌గా 160 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.05 ఎకానమీతో 150 వికెట్లు పడగొట్టాడు.