Begin typing your search above and press return to search.
'హార్డ్ హిట్టర్ మాక్స్‌వెల్ చాలా సెన్సిటివ్' అంటున్న ప్రేయసి విని
By: Tupaki Desk | 12 April 2020 1:30 AM GMTఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన విని రామన్‌తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత సంప్రదాయ ప్రకారం అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో మ్యాక్స్‌వెల్, అతని కుటుంబ సభ్యులు తళక్కుమన్నారు. ఆకర్షణీయమైన కట్టు బొట్టుతో ఆకట్టుకున్నారు. మైదానంలో పసుపు రంగు ఆస్ట్రేలియా జెర్సీల్లో నిత్యం కనిపించే మాక్సీ ఈ వేడుకలో షేర్వాణి ధరించాడు. నుదుటన తిలకం సైతం దిద్దుకున్నాడు. ఎంతో అందంగా ఇండియన్ కుర్రాడే అనిపించాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులు సైతం చీర, లెహెంగా వంటి సంప్రదాయ దుస్తులే ధరించడం ప్రత్యేకం. ఈ ఫొటోలను విని రామన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
మాక్స్‌వెల్, వినీ రామన్ చాన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి వేడుకలు, షికార్లకు కూడా వెళ్లారు. ఆ మధ్య మాక్సీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నానని క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు. ఇక భారత సంతతికి చెందిన వినిరామన్ ఒక ఫార్మసిస్ట్. 2013లో ఒక అవార్డు వేడుకలో మాక్స్ వెల్ తో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. అంతేగాక ముందుగా ఆయనే నాకు ప్రొపోజ్ చేశాడంటూ సిగ్గు పడుతూ వారి ప్రేమ విషయాలు చెప్పుకొచ్చింది. ఇక ఇద్దరి వయసుల మధ్య 4 సంవత్సరాల 5 నెలల తేడా ఉందని, అదీగాక గ్లేన్ చాలా సున్నితమైన వ్యక్తని.. ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా తమ సీక్రెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది విని. మీ జంట చూడముచ్చటగా ఉందంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తుండటంతో ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.
ఈ ఫొటోలకు ఆమె 'గత రాత్రి మేం భారత సంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో మాక్సీకి చిన్న టీజర్ చూపించాను. మా రెండు కుటుంబాలు, మిత్రులు ఈ వేడుకను చూసి ఆనందించారు' అని క్యాప్షన్‌గా పేర్కొంది.