Begin typing your search above and press return to search.
ఎందుకు భయ్యా.. ఎన్నికల వేళ పీకేను కెలకటం?
By: Tupaki Desk | 28 Dec 2019 5:11 AM GMTకొందరిని అస్సలు టచ్ చేయకూడదు. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకోవటం కన్నా తెలీనట్లుగా ఉండిపోవటానికి మించిన సుఖం మరొకటి ఉండదు. కానీ.. ఆ విషయాన్ని కేంద్రమంత్రి మర్చిపోయినట్లున్నారు. ఎన్నికల వేళలో ఎవరినైతే కెలకకూడదో వారినే కెలికేయటం ద్వారా తమ గోతిని తామే తీసుకున్నారా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. ఎన్నికల వ్యూహకర్త.. తాను రంగంలోకి దిగితే చాలు.. తాను టార్గెట్ చేసిన వారికి సీన్ సితార చేసే సత్తా ఉన్న ప్రశాంత కిశోర్ మీద కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ అధికారపక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పని చేసేందుకు ఓకే అనటం తెలిసిందే. తమ ఎన్నికల వ్యూహకర్తగా ఆమ్ ఆద్మీ పార్టీ పీకేను ఎంపిక చేసుకుంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తన క్లయింట్లకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టే వరకూ పీకే నిద్ర పోరన్న ఇమేజ్ ఉంది.
ఇప్పటివరకూ ఆయన డీల్ చేసిన ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావటమే కానీ.. ఓటమి ఎదురైంది లేదు. అంతటి ట్రాక్ రికార్డు ఉన్న పీకేను కెలికేశారు కేంద్రమంత్రి. తాజాగా మాట్లాడిన ఆయన ప్రశాంత్ కిషోర్ ఎవరు? అసలు ఆయన పేరును తానెప్పుడూ వినలేదని..అతడెవరో కూడా తనకు తెలీదని వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు తన చేతలతో సమాధానం ఇవ్వటం పీకేకు అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క రాష్ట్రం చేజారిపోతున్న వేళ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను ప్రదర్శించని పక్షంలో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ప్రచారం సాగుతోంది.
ఇలాంటి వేళ.. తానెవరో తెలీని..తన పేరు కూడా తెలీని కేంద్రమంత్రికి ఢిల్లీ ఫలితాలతో తాను ఎప్పటికి గుర్తుండిపోయే రీతిలో ఫలితాన్ని ఇవ్వాలని మరింత గట్టిగా పీకే ఫిక్స్ అయ్యేలా కేంద్రమంత్రి మాటలు ఉన్నాయమంటున్నారు. కలిసి రాని కాలంలో ఇలాంటి మాటలే వస్తాయేమో?