Begin typing your search above and press return to search.
మెంటల్ గా ప్రిపేర్ కండి.. బాదుడు ఆగేది లేదన్న విషయాన్ని చెప్పేశారు
By: Tupaki Desk | 24 Sept 2021 3:00 PM ISTసామాన్యుడి మొదలు సంపన్నుడి వరకు అందరిని ఇబ్బందికి గురి చేస్తున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు సంబంధించి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? దేశ ప్రజల వీపులు బద్ధలయ్యేలా బాదేస్తున్న ధరల నుంచి కాస్తంత అయినా ఉపశమనం ఉంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం లభించింది. తాజాగా కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన పదిహేను రోజులుగా పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగని పరిస్థితి. దీనికి తోడు ఈ మధ్యన ఈ రెండింటిని.. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారంటూ తెర మీదకు వచ్చిన వార్తలు కొత్త ఆశలు కలిగేలా చేసినా.. నిర్మలా సీతారామన్ సీన్లోకి వచ్చి.. రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదంటూ బండ వారి నెత్తిన వేసి తమ దారిన తాము వెళ్లిపోయారు.
జీఎస్టీలోకి తేవటానికి రాష్ట్రాలు ఒప్పుకోవు సరే.. సుంకాల షాకుల్ని కేంద్రం తగ్గిస్తానంటే రాష్ట్రాలు నో అనవు కదా? మరి.. ఆ పని ఎందుకు చేయరన్న దానికి సమాధానం లభించని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటికే లీటరు పెట్రోల్ వంద దాటేయటం.. డీజిల్ ధర సెంచరీకి అడుగు దూరమన్న చందంగా ఆగటం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో సెంచరీని కొట్టేయటం ఖాయమని చెప్పక తప్పదు. పెట్రోల్.. డీజిల్ రెండు లీటరు సెంచరీని దాటించేసిన ఘనతను మోడీ సర్కారు 2 మూటకట్టుకోనుందన్నది వాస్తవం.
ఇక.. పురి మాష్టారు మాట్లాడుతూ.. పెట్రోల్ డీజిల్ ధరలు దిగి రావని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం నిర్మలమ్మ చెప్పిన మాటల్ని కాస్తంత మార్చి.. పెట్రోల్.. డీజిల్ ధరల్ని జీఎస్టీలోకి తీసుకురావటానికి రాష్ట్రాలు ఒప్పుకోవని.. అందువల్ల ధరలు తగ్గే ఛాన్సు లేదని తేల్చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయని.. దీంతో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని చెప్పారు. తాజాగా ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కారుపై విమర్శలు సంధించారు.
టీఎంసీ సర్కారు భారీగా పన్నులు మోపటం వల్ల పశ్చిమబెంగాల్ లో లీటరు పెట్రోల్ రూ.100 దాటిందంటూ విస్మయాన్ని రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ వంద మార్కు దాటి చాలా కాలమే అయ్యింది. ఆ విషయాన్ని కేంద్రమంత్రి వర్యులు మర్చిపోయారా? లేదంటే.. పశ్చిమ బెంగాల్ లోని ప్రతి విషయాన్ని ఏదోలా విమర్శించాలన్న ఎజెండాతో అలా మాట్లాడారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఏమైనా.. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయన్న సంకేతాల్ని ఇచ్చేసిన నేపథ్యంలో.. మెంటల్ గా ప్రిపేర్ కావటం మంచిదని చెప్పక తప్పదు.