Begin typing your search above and press return to search.
అమ్మాయిలపై కామెంట్లు..క్రికెటర్లు బుక్కయ్యారు
By: Tupaki Desk | 10 Jan 2019 1:30 AM GMTభారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య.. కేఎల్ రాహుల్ ఓ అనవసర వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించే టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో వీళ్లు చేసిన ఓవరాక్షన్ పెద్ద వివాదానికే దారి తీసింది. బీసీసీఐ వీళ్లిద్దరికీ షోకాజ్ నోటీసులివ్వడంతో పాటు ఇకపై భారత క్రికెటర్లెవ్వరూ ఇలాంటి షోల్లో పాల్గొనకుండా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చే పరిస్థితి తలెత్తింది. ఈ ఇద్దరు క్రికెటర్లు తమకు అమ్మాయిలతో ఉన్న సంబంధాలను చాలా ఓపెన్‌గా మాట్లాడేశారు. ముఖ్యంగా పాండ్య అయితే.. తాను తొలిసారి వర్జినిటీ కోల్పోయిన రోజు వెళ్లి తన తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పానన్నాడు. ఒక పార్టీలో భాగంగా తన తల్లిదండ్రులు నీ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడా అని అడిగితే.. తాను ముగ్గురు నలుగురు అమ్మాయిల్ని చూపిస్తే.. వాళ్లు తన పట్ల గర్వంగా చూసినట్లు కూడా చెప్పాడు.
పార్టీల్లో అమ్మాయిల్ని తానెలా చూస్తానో కూడా వల్గర్ గా చెప్పాడు పాండ్య. మరోవైపు యుక్త వయసులో తన జేబుల్లో కండోమ్స్ పెట్టుకుని తిరిగిన విషయాన్ని రాహుల్ ఈ షోలో ప్రస్తావించాడు. ఇద్దరూ కలిసి ఒక అమ్మాయి కోసం లైన్ వేస్తే ఏం చేస్తారని అడిగితే.. అమ్మాయే తేల్చుకుంటుందని రాహుల్ అంటే.. ఎవరి టాలెంటుని బట్టి వాళ్లు ట్రై చేసుకోవచ్చని పాండ్య అన్నాడు. ఇలా రాహుల్.. పాండ్య ఈ షోలో శ్రుతి మించే మాట్లాడారు. పాండ్య అయితే మరీ అతి చేశాడు. బీసీసీఐ షోకాజ్ నోటీసులపై పాండ్య వెంటనే స్పందించాడు. ట్విట్టర్ ద్వారా జనాలకు క్షమాపణలు చెప్పాడు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలిపాడు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావన్నాడు.