Begin typing your search above and press return to search.

పాండ్యా మెరుపు ఇన్నింగ్స్..ఆమె హృద‌యం నిండిపోయింది!

By:  Tupaki Desk   |   5 March 2020 2:30 AM GMT
పాండ్యా మెరుపు ఇన్నింగ్స్..ఆమె హృద‌యం నిండిపోయింది!
X
న‌టాషా స్టాంకోవిచ్.. భార‌త క్రికెట్ వ‌ర్గాల్లో కొంత కాలంగా ఈ పేరు హాట్ టాపిక్. విదేశీయురాలైన ఈ అమ్మాయి సినిమాల కోసం ఇండియాకు వ‌చ్చి భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్‌ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య ప్రేమ‌లో ప‌డిపోయింది. ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకు తిరుగుతున్నారు రెండేళ్లుగా. ఈ మ‌ధ్యే ఇద్ద‌రూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని ఒక‌ట‌వుతున్నారు. ఐతే హార్దిక్‌ తో బంధం గురించి న‌టాషా పెద్ద‌గా స్పందించ‌దు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటుంది. అలాంట‌మ్మాయి పాండ్య తాజాగా ముంబ‌యిలో జ‌రుగుతున్న డీవై పాటిల్ టీ20 టోర్న‌మెంట్లో విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడిన పాండ్య‌ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించింది.

ఈ టోర్నీలో పాండ్య కేవ‌లం 39 బంతుల్లోనే 105 ప‌రుగులు సాధించాడు. అందులో 7 ఫోర్లు - 10 సిక్స‌ర్లు ఉన్నాయి. జీవరాజన్ అనే బౌల‌ర్ వేసిన ఒక ఓవ‌ర్లో పాండ్య‌ 3 సిక్సర్లు - 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు పిండుకోవ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాండ్యా పెవిలియన్‌ కు వెళ్తున్న ఫొటోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ అకౌంట్‌ లో షేర్‌‌ చేసిన న‌టాషా... ‘హార్దిక్‌ కుంగ్‌ ఫూ పాండ్యా 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ద డెడ్లీ హిట్టర్ ఈజ్‌ బ్యాక్‌ టు వర్క్‌..'అనే క్యాప్షన్ జోడించింది. అలాగే, గర్జిస్తున్న సింహం - మై హార్ట్ ఈజ్‌ ఫుల్ అనే స్టిక్కర్లను కూడా ఆమె జత చేసింది. జ‌న‌వ‌రి 1న నూత‌న సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఓ బోట్‌ లో న‌టాషాతో హార్దిక్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.