Begin typing your search above and press return to search.
సచిన్ కుమార్తె.. గిల్ మధ్యలో హార్దిక్!
By: Tupaki Desk | 16 Jun 2019 5:00 AM GMTయువక్రికెటర్ శుభ్ మన్ గిల్ తెలుసుగా. కుర్రాడు.. చలాకీగా ఉంటాడు. తాజాగా అతగాడు సోషల్ మీడియాలో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారు. ఈ కుర్రాడు ఈ మధ్యనే కొత్త రేంజ్ రోవర్ కారు కొన్నాడు. దాంతో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దానికి క్రికెటర్ దేవుడు సచిన్ కుమార్తె సారా కంగ్రాట్స్ చెబుతూ లవ్ ఎమోజీని జత చేసింది. దీనికి పెద్ద పెద్ద అర్థాలు తీసుకోనక్కర్లేదు. ఇదంతా కామనే.
సారా మెసేజ్ కు గిల్ రియాక్ట్ అయ్యారు.. థ్యాంక్స్ అని పెట్టి ఉంటే సరిపోయేది. మనోడు కూడా లవ్ ఎమోజీని జత చేసి పెట్టేశాడు. దాంతో.. అభిమానులు రియాక్ట్ కావటం మొదలెట్టారు. ఏయ్.. అంటూ ఎవరికి వారు సరదాగా ఆట పట్టించటం షురూ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఇష్యూను మరో లెవల్ కు తీసుకెళ్లాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.
ఎప్పుడు హుషారుగా ఉంటూ తన అల్లరితో సహచరుల్ని సరదాగా ఆటపట్టించే పాండ్యా ఇలాంటి విషయాల్లో కామ్ గా ఉంటాడా? అతను రియాక్ట్ అయ్యాడు. వీరి పోస్ట్ కు స్పందించిన అతగాడు.. ఆమె నుంచి వెల్ కం అన్న సందేశంతో పాటు.. కన్ను కొడుతున్న ఎమోజీని పంపారు. మామూలుగా అయితే వీటిని లైట్ తీసుకునే వారు.
కానీ.. అక్కడ ఉన్నది సచిన్ కుమార్తె కావటంతో ఈ మొత్తం వ్యవహారం మీద ఇప్పుడు ఆసక్తి ఎక్కువైంది. హార్దిక్ అల్లరి తెలిసినోళ్లు లైట్ తీసుకొని వదిలేస్తారా?. . లేదా ఇష్యూ మరో వైపునకు వెళుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. హార్దిక్ పోస్ట్ కు అటు సారా.. ఇటు గిల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.