Begin typing your search above and press return to search.
నాకు తెలిసిన హార్దిక్ ఇలాంటివాడు కాదు!
By: Tupaki Desk | 20 Jan 2019 10:09 AM GMTబాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోలో బోల్డ్ టాక్ ఉంటుందని తెలిసిందే. ఆ బోల్డ్ టాక్ వల్ల ఫిలిం సెలబ్రిటీలకు ఎప్పుడూ పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు కానీ క్రికెటర్లయిన హార్దిక్ పాండ్యా.. లోకేష్ రాహుల్ మాత్రం చిక్కుల్లో పడ్డారు. బీసిసిఐ సస్పెన్షన్ వేటుకు గురయ్యారు.
హార్దిక్ బాలీవుడ్ బ్యూటీ ఎల్లి అవ్రామ్ తో ప్రేమాయణం నడిపిన విషయం గతంలో బాలీవుడ్ మీడియాలో ఒక హాట్ టాపిక్. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. తాజాగా కరణ్ జోహార్ కాఫీ హార్దిక్ కొంప ముంచడంతో ఈ వివాదంపై ఎల్లి బేబీ స్పందించింది. అప్పట్లో తనకు తెలిసిన హార్దిక్ పాండ్యా ఇలాంటివాడు కాదని.. హార్దిక్ కామెంట్లు తనకు ఆశ్చర్యం కలిగించాయని తెలిపింది. క్రికెటర్లను యువత రోల్ మోడల్స్ గా భావిస్తారని.. అందుకే వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. నేషనల్ లెవెల్ లో ప్రసారం అయ్యే కార్యక్రమంలో ఇలాంటి దిగజారుడుతనం సరికాదని చెప్పింది. మహిళలను గౌరవించడం అనేది బాధ్యత.. కానీ వారిని ఒక వస్తువులా చూస్తున్నవారిపై మహిళలు తమ నిరసనను తెలుపుతున్నారని చెప్పింది.
హార్దిక్ మాజీ స్నేహితురాలు ఎల్లి అవ్రామ్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో చాలామంది హార్దిక్.. రాహుల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు సభ్యత సంస్కారాలు పాటించాలని లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందని సెటైర్లు వేస్తున్నారు.