Begin typing your search above and press return to search.
రాహుల్-హార్దిక్ భేటీలో రూ.200 కోట్ల డీల్?
By: Tupaki Desk | 25 Oct 2017 9:38 AM GMTత్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ - బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. కాంగ్రెస్ - బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు - పటేళ్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ల మధ్య రహస్య సమావేశాలు - చీకటి ఒప్పందాల గురించి సంచలన కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. వారిద్దరి భేటీకి సంబంధించిన సీసీ టీవీ వీడియో దృశ్యాలు కొన్ని మీడియా చానెళ్లలో ప్రసారం కూడా అయ్యాయి. ఆ హోటల్ లోని ఓ గదిలోకి హార్థిక్ వెళుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. హార్దిక్ వెళ్లిన గదిలో రాహుల్ ఉన్నారని, వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారని వదంతులు వచ్చాయి. ఆ వీడియోలో హార్దిక్ పటేల్ ఓ నలుపు రంగు సూట్ కేసుతో వెళ్లడం పెను సంచలనం రేపింది. రాహుల్ - హార్దిక్ ల మధ్య భారీ డీల్ కుదిరిందని, ఆ సూట్ కేసులో హార్దిక్ డబ్బు తీసుకెళ్తున్నారని సోషల్ మీడియాలో పుకార్లు వెలువుడుతున్నాయి.
రాహుల్ - హార్దిక్ ల భేటీ పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ భేటీ లో హార్దిక్ కు రాహుల్ భారీ నగదును ఆఫర్ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. రాబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు దాదాపు రూ. 200 కోట్లను రాహుల్ డీల్ కుదుర్చుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. హార్దిక్ కు రాహుల్ ఆ మొత్తాన్ని బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వదంతులు వెలువడుతున్నాయి.వారి మధ్య 200 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని, అందుకే హార్థిక్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఆ సూట్ కేసులో ఏముంది? నిజంగానే డీల్ కుదిరిందా లేదా అన్న దానిపై సామాన్య జనాలు అమోమయానికి లోనవుతున్నారు. మరోవైపు, ఆ సీసీటీవీ ఫుటేజీని తామే ఇచ్చామని హోటల్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లీక్ కావడం ప్రైవసీ పాలసీకి విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వదంతులపై హార్దిక్ తరపున ఎటువంటి ప్రకటన వెలువడలేదు.