Begin typing your search above and press return to search.
ఈ ముగ్గురు మోడీకీ ముచ్చెమటలు పట్టిస్తున్నారు
By: Tupaki Desk | 10 Nov 2017 6:18 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో...22 ఏళ్ల క్రితం బీజేపీ అధికారానికి వచ్చినప్పుడు ఒకరు రెండేళ్ల పసిబాలుడు కాగా - మరొకరికి పన్నెండేళ్లు - ఇంకొకరు 18 ఏళ్ల టీనేజ్ యువకుడు. ఆ వయసులో వారికి లోకం పోకడ - రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ప్రజా నాయకులుగా ఎదిగారు. తమ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తూ గుజరాత్ లో బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. వారే పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ (24) - దళిత వర్గాల నాయకుడు జిగ్నేశ్ మేవాని (34) - ఓబీసీల నేతగా ఎదిగిన అల్పేశ్ ఠాకూర్ (40) - రాష్ట్ర రాజకీయాలను శాసించగల మూడు ప్రధాన ఓటు బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి అపూర్వంగా ప్రజాదరణ లభించడం, పైగా తమకు ప్రత్యర్ధులుగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కారణంగా కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హార్దిక్ పటేల్ దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. ``స్ప్రింగ్ ను చాలాకాలంగా నొక్కి పెట్టారు (స్ప్రింగ్ కో బహుత్ దబాయా హై). గత 25 ఏళ్లలో రైతులు - వ్యాపారులు సహా ప్రజలకు ఏ మేలూ జరుగలేదు. నిరసన తెలిపిన వారిని భయపెడుతున్నారు - జైళ్లకు పంపుతున్నారు. వ్యాపారులు నిరసన గళం వినిపిస్తే వారిపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. అవినీతి భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. ఇందుకు సానుకూలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడితే - పరిస్థితులు తప్పకుండా మారుతాయి`` అని హార్దిక్ పటేల్ ఇటీవల పేర్కొన్నారు. హార్దిక్ సామాజికవర్గమైన పాటిదార్లు రాష్ట్రంలో 12-14 శాతం మధ్య ఉంటారు. వీరికి విద్య - ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రెండేళ్ల క్రితం హార్దిక్ పటేల్ ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఆయనను జైలుపాలు చేసి జాతి వ్యతిరేకి అన్న ముద్ర వేసింది. గత రెండేళ్లలో అతని ఉద్యమానికి మద్దతు పెరిగిందే తప్ప తగ్గలేదు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన హార్దిక్ ఏ పార్టీకి మద్దతునిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు.
ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్ సైతం మోడీ సర్కారుపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ``ఓబీసీల నుంచి వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతపై బీజేపీ కులం ముద్ర వేసింది. నిజానికి మతం కార్డును ప్రయోగించింది బీజేపీనే. ఇప్పుడు మా పోరాటాలకు కులం రంగు పులుముతోంది. మేము పేదలు - అభివృద్ధి ఫలాలు అందని వారి తరఫున పోరాడుతున్నాం. బీజేపీ ఆటలు ఇక సాగవు`` అని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన అల్పేశ్ రాష్ట్రంలో మద్య నిషేధ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. గుజరాత్ లో ఓబీసీలు 40-45 శాతం మధ్య ఉన్నారు. గుజరాత్‌లో మొదటినుంచి దళితులు - ఓబీసీలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు.
ఇక బలమైన దళిత నేత జిగ్నేశ్ మేవాని సైతం బీజేపీ తీరుపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ``అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదు. దాదాపు అన్ని వర్గాలకు చెందినవారు ఆందోళనలు చేస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు - వ్యాపారులు - దళితులు - పాటిదార్లు - రైతులు పోరాడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఫాసిజం పోకడలను అరికట్టాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. భిన్న గ్రూపులకు చెందిన వారు తమ వైరుధ్యాలను మరిచి ఈ ఫాసిస్టు ధోరణులను ఓడించేందుకు సమైక్యమవుతున్నారు. గుజరాత్ లో బీజేపీని ఓడించడం 2019లో కీలకంగా మారుతుంది. అందుకే సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడేందుకు సిద్ధపడ్డాను`` అని మేవాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న దళితులు ఉనా ఘటన తరువాత సంఘటితమయ్యారు. గోవధపై నిషేధాన్ని అడ్డంపెట్టుకొని జరిగిన దాడులు కూడా దళితులను సంఘటితం చేశాయి. వచ్చే నెల 9 - 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇలా కీలక వర్గాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గుజరాత్ లో గత 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత - మరోవైపు పుంజుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్ - ఇంకోవైపు ముగ్గురు యువ నేతల వెనుకనున్న వర్గాలను తమవైపునకు తిప్పుకోవడం.. ఈ మూడు అంశాలకు బీజేపీ వేర్వేరుగా వ్యూహాలు రచిస్తోంది. ఎన్ని ప్రతికూల అంశాలున్నా బీజేపీ మరోసారి 10 శాతం ఓట్ల తేడాతో అధికారానికి వస్తుందని ముందస్తు సర్వేలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో 182 సీట్లుండగా - ఈ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించడం - కనీసం 50 బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొననుండటం తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్న పట్టణ - నగరాల ఓటర్లు మరోసారి తమకే పట్టం కడుతారని ఆ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.