Begin typing your search above and press return to search.

ఆయన ముఖ్యమంత్రిని ఆంటీ అని పిలుస్తారట

By:  Tupaki Desk   |   23 Dec 2015 5:25 AM GMT
ఆయన ముఖ్యమంత్రిని ఆంటీ అని పిలుస్తారట
X
వయసులో పెద్ద అయిన మహిళల్ని ‘‘ఆంటీ’’ అనటం మామూలే. కానీ.. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ పటేల్ కు మాత్రం ఆ మాట అంటే మంటంట. ఎవరైనా ఆమెను ఉద్దేశించి ‘ఆంటీ’ అని వ్యాఖ్యానిస్తే.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారట. విపరీతంగా అసహనం చెందుతారట. అంతేకాదు.. ఏ సందర్భంలోనూ తనను ఉద్దేశించి ‘ఆంటీ’ అన్న పదాన్నే చేర్చవద్దని విస్పష్టంగా చెబుతుంటారట.

గుజరాతీలో ఆంటీని ‘ఫోయ్’ అని వ్యవహరిస్తుంటారు. ఈ మాట ఎవరి నోట వెంట వస్తే చాలు.. ఆనందీ ముఖంలో రంగులు మారిపోతాయట. తనను పెద్దక్క అని పిలవాలని ఆమె కోరుకుంటారని ఆమె గురించి తెలిసిన ప్రతిఒక్కరు చెబుతుంటారు. ఆంటీ అన్న మాట గుజరాత్ ముఖ్యమంత్రికి ఎంత మంటపుట్టిస్తుందో తెలుసు కాబట్టే.. పటేళ్ల ఉద్యమకర్త హార్దిక్ పటేల్.. గుజరాత్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘ఆంటీ’ అని సంబోధిస్తూ ఆమెకు ఆగ్రహం వచ్చేలా చేస్తుంటారని చెబుతుంటారు.

ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శలు చేయాల్సి వస్తే.. ఫోయ్ అని వ్యవహరించటం ద్వారా.. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ పటేల్ కు చిరాకు పుట్టించేలా చేస్తుంటారని చెబుతుంటారు. ఆంటీ అన్నది తప్పు మాట కాకున్నా.. ఆనందీకి ఎందుకంత అసహనం అని పలువురు ప్రశ్నిస్తుంటారు. మొత్తానికి తన రాజకీయ ప్రత్యర్థిని హార్దిక్ తన నోటి మాటతో తరచూ అసహనానికి గురి చేస్తుంటారన్నమాట.