Begin typing your search above and press return to search.
హార్దిక్ మాట!..బీజేపీ ట్యాంపరింగ్ కు పాల్పడింది!
By: Tupaki Desk | 17 Dec 2017 9:03 AM GMTహార్దిక్ పటేల్.... గుజరాత్ లోని పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కదనరంగంలోకి దిగి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏకంగా కేంద్రంలోని మోదీ సర్కారుకు కూడా ముచ్చెమటలు పట్టించిన యువకుడిగా మనందరికీ తెలుసు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఈ యువకుడు నిర్వహించిన సభలకు పాటీదార్లు పోటెత్తారు. గుజరాత్ పొలిటికల్ కేపిటల్ అహ్మదాబాదును వణికించేశారు. కేవలం రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన హార్దిక్... ఆ తర్వాత చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఇటీవలి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టి... మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. మొత్తంగా హోరాహోరీగా జరిగిన ప్రచారం, పోలింగ్ ముగిసిపోయాయి. ఇప్పుడు ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో మరోమారు బీజేపీకి అధికార పగ్గాలు దక్కనున్నాయని దాదాపుగా తేలిపోయింది. ఈ క్రమంలో హార్దిక్ సంచలన ఆరోపణలు చేస్తూ... పెను కలకలమే రేపుతున్నారు.
రిజర్వేషన్ల ఉద్యమ నేతగా ఉన్న హార్దిక్.. ఈ ఆరోపణల ద్వారా తనను తాను ఫక్తు పొలిటీషియన్‌గా ఆవిష్కరించుకున్నారన్న వాదన వినిపిస్తోంది. అయినా హార్దిక్ చేసిన ఆరోపణలేమిటన్న విషయానికి వస్తే... గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల)ను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను బీజేపీ నేతలు ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హార్థిక్ పటేల్ ట్విట్టర్ వేదికగా సూచించారు. హార్థిక్ పటేల్ చేసిన ఈ సంచలనాత్మక ఆరోపణలను పటీదార్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు కూడా ఉన్నాయట.
వడోదరలోని కర్జాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఎన్నికల ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టేరీతిలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ హార్దిక్ వ్యాఖ్యలు చేశారు. హార్థిక్ వరుస ట్వీట్లలో ఏమన్నారంటే.. *గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయంకృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే గుజరాత్ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది* అని ఆ ట్వీట్లలో హార్దిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.