Begin typing your search above and press return to search.

ఒక‌టి కాదు.. బీజేపీ ద‌గ్గ‌ర 52 సీడీలున్నాయ‌ట‌

By:  Tupaki Desk   |   17 Nov 2017 9:55 AM GMT
ఒక‌టి కాదు.. బీజేపీ ద‌గ్గ‌ర 52 సీడీలున్నాయ‌ట‌
X
వాడీ వేడిగా సాగుతోంది గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీని దెబ్బ తీస్తే రాజ‌కీయంగా పెను మార్పులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ భావిస్తోంది. అదే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ ప‌ట్టును విడిచి పెట్టేందుకు బీజేపీ నేత‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డేందుకు కాచుకు కూర్చున్న బీజేపీ.. కాంగ్రెస్ నేత‌ల తీరుతో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం పీక్స్‌ కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ప‌టేళ్ల ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్ కు సంబంధం ఉందంటూ ఒక ఇంటిమేట్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హార్దిక్ ప‌టేల్ మాదిరి ఉన్న వ్య‌క్తి ఒక అమ్మాయితో ద‌గ్గ‌ర‌గా ఉన్న వీడియో ఒక‌టి విడుద‌లైంది. అయితే.. ఆ వీడియోక్లిప్ తో త‌న‌కు సంబంధం లేద‌ని హార్దిక్ చెప్పారు.

ఇదిలా ఉంటే.. తాజాగా సీడీల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు హార్దిక్‌. ఒక అమ్మాయితో తాను ఉన్న‌ట్లుగా వ‌చ్చిన సీడీల మాదిరే.. మ‌రికొన్ని సీడీల‌ను బీజేపీ సిద్ధం చేసిందంటూ వెల్ల‌డించారు. త‌న‌ను.. త‌న పార్టీని బ‌ద్నాం చేయ‌టం కోసం బీజేపీ నేత‌లు చౌక‌బారు సీడీల్ని పెద్ద ఎత్తున త‌యారు చేయించార‌న్నారు.

త‌న‌కున్న స‌మాచారం ప్ర‌కారం త‌న‌పైనా.. త‌న వ‌ర్గానికి చెందిన ఇత‌ర నేత‌ల మీద న‌కిలీ సీడీల్ని త‌యారు చేశార‌న్నారు. అంతేకాదు.. త‌నొక్క‌డి మీద‌నే దాదాపు 22 న‌కిలీ సీడీల‌ను బీజేపీ నేత‌లు త‌యారు చేయించార‌ని.. త‌మ పార్టీకి చెందిన మ‌రో 30 మంది నేత‌ల‌కు సంబంధించి న‌కిలీ సీడీల్ని బీజేపీ నేత‌లు త‌యారు చేశార‌న్నారు. ఈ న‌కిలీ సీడీల విష‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి బాధ్య‌త వహించాల‌న్నారు. ఇదిలా ఉంటే ప‌టేళ్ల నేత‌లు చేస్తున్న సీడీల ఆరోప‌ణ‌ను బీజేపీ నేత‌లు ఖండిస్తున్నారు. మ‌రో 52 సీడీలు త‌మ ద‌గ్గ‌ర ఉన్న‌ట్లుగా హార్దిక్ ప‌టేల్ చెప్ప‌టాన్ని బీజేపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. త‌మ‌పై కాంగ్రెస్ నేతలే సీడీలు త‌యారు చేస్తున్నారంటూ ఆరోపించారు. వ‌చ్చే నెల‌లలో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హార్దిక ప‌టేల్ పోటీ చేయ‌టం లేదు. కాకుంటే బీజేపీ మెజార్టీ త‌గ్గించ‌ట‌మే త‌న ముందున్న ల‌క్ష్యంగా చెబుతున్నారు. గ‌డిచిన 22 ఏళ్లుగా బీజేపీ నేతృత్వంలో అధికారాన్ని చేప‌డుతున్న గుజ‌రాత్ ప్ర‌భుత్వాన్ని పవ‌ర్ లోకి రానివ్వ‌కుండా ఉండ‌ట‌మే త‌న లక్ష్య‌మ‌ని హార్దిక్ చెబుతున్నారు. మ‌రి.. ఎవ‌రు అంతిమ విజేత‌గా నిలుస్తార‌న్న‌ది తేలాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.