Begin typing your search above and press return to search.

5వేల కార్లతో గుజరాత్ లోకి అడుగుపెడతాడట

By:  Tupaki Desk   |   17 Jan 2017 8:20 AM GMT
5వేల కార్లతో గుజరాత్ లోకి అడుగుపెడతాడట
X
గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దాదాపు ఆరు నెలల నుంచి గుజరాత్ రాష్ట్రానికి దూరంగాఉన్న పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నాయకుడు హార్దిక్ పటేల్ గుజరాత్ లోకి అడుగుపెట్టనున్నారు. పటేళ్లకు ఉద్యోగాలు.. విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ తో బీజేపీ సర్కారుకు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు తన ఆందోళనలతో చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ఆందోళనలు.. నిరసనలతో గుజరాత్ అట్టుడిగి పోవటమేకాదు.. ఆయన్ను గుజరాత్ నుంచి ఆరునెలల పాటు బహిష్కరించారు. గుజరాత్ ప్రభుత్వం హార్దిక్ పై మోపిన రాజద్రోహం కేసు నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ మంగళవారంతో ముగిసింది.

తాజాగా ఆయనరాజస్థాన్ సరిహద్దుల గుండా గుజరాత్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను గుజరాత్ లోకి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు వీలుగా.. భారీ కాన్వాయ్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేలకు పైగా కార్లతో హార్దిక్ పటేల్ కు స్వాగతం పలకాలని నిర్ణయించారు. దాదాపు లక్ష మంది కార్యకర్తలతో రతన్ పూర్ నుంచి హిమ్మత్ నగర్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నట్లు పాటీదార్ అనామత్ ఆందోళన సమితి పేర్కొంది.

ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. హార్దిక్ రీఎంట్రీ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీజేపీకి కంచుకోట లాంటి గుజరాత్ లో మోడీ ప్రాబల్యానికి బీటలు వారేలా చేసేందుకు హార్దిక్ ను తురపు ముక్కలా వాడాలని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. హార్దిక్ మద్దతు తమకు ఉంటుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ బరిలోకి దిగే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/