Begin typing your search above and press return to search.
మళ్లీ హార్దిక్ పటేల్ సెక్సు వీడియోలు..
By: Tupaki Desk | 7 Dec 2017 5:57 AM GMTగుజరాత్ ఎన్నికల పోలింగ్ కు మూడ్రోజుల ముందు మరోసారి పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ టార్గెట్ గా వీడియోలు విడుదలయ్యాయి. ఓ మహిళతో హార్ధిక్ సన్నిహితంగా ఉన్న ఈ వీడియోలు బుధవారం బయటకొచ్చాయి. ఆ తరువాత నెట్లో ఇవి వైరల్ గా మారిపోయాయి. కాగా ఇంతకుముందు కూడా ఓ వీడియో బయటకు రావడం.. దాని వెనుక బీజేపీ కుట్ర ఉందని, అందులో ఉన్నది తాను కాదని, అది మార్ఫింగ్ వీడియో అని హార్దిక్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజా వీడియలోపై ఆయనేమీ స్పందిచనప్పటికీ పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేతలు మాత్రం దీనిపై స్పందించారు. ఇవన్నీ మార్ఫింగ్ వీడియోలని వారు ఆరోపిస్తున్నారు.
కాగా హార్దిక్ ఇంతకుముందే దీనిపై మాట్లాడారు. మొదటి వీడియో బయటకొచ్చినప్పుడు మాట్లాడుతూ... ఎన్నికల వేళ బీజేపీ తనను టార్గెట్ చేస్తుందని... మహిళతో తాను ఏకాంతంగా ఉన్న వీడియోలను బీజేపీ విడుదల చేసే అవకాశం ఉందని హార్ధిక్ గతంలో చెప్పారు. అంతేకాదు, ఇటువంటివి మరిన్ని వీడియోలను విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అప్పట్లో హార్ధిక్ పేర్కొన్నారు.
తాజా వీడియోల్లో హార్ధిక్ మరో ఇద్దరితో కలిసి ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. వారున్న గదిలో లైట్లు ఆపేసిన తర్వాత మిగతా ఇద్దరు పురుషులు బయటకు వెళ్లగా హార్ధిక్ ఒక్కడే లోపల ఉన్నట్లుగా ఆ వీడియోల్లో ఉంది. కాగా ఈ వీడియోపై పటీదార్ అనామత్ ఆందోళన సమితి కో కన్వీనర్ దినేశ్ బంభానియా వీటిని ఖండించారు. ఇవికూడా మార్ఫింగ్ చేసిన వీడియోలని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలను ప్రసారం చేయవద్దని మీడియోను కోరారు. అయితే... తొలి విడత వచ్చిన వీడియోలు తరువాత అవి మార్ఫింగ్వని ఎక్కువమంది భావించినా తాజా వీడియోల తరువాత అందులో ఉన్నది హార్దికే కావొచ్చన్న అనుమానాలూ కొందరి నుంచి వ్యక్తమవుతున్నాయి.