Begin typing your search above and press return to search.
హార్దిక్ పటేల్ రివర్స్ దండి మార్చ్
By: Tupaki Desk | 2 Sep 2015 12:05 PM GMTమహాత్మగాంధీ స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడేందుకు పలు పద్దతులు అవలంభించారు. నిరసన నుంచి సత్యాగ్రహం వరకు గాంధీజీ ఏది చేసినా హైలెట్ అయ్యింది. ఇప్పుడు గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 22 సంవత్సరాల హార్దిక్ పటేల్ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమం కూడా అక్కడ ప్రభుత్వాన్ని వణికిస్తోంది. ఒకే ఒక్కడు స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడంతో పాటు ఢిల్లీని కూడా తాకింది. మోడీ సైతం మహాత్ముడు నడయాడిన నేలలో హింస వద్దంటూ ట్వీట్ చేసి గుజరాత్ ఆందోళన కారులను శాంతపరిచే ప్రయత్నం చేశారు. అంచనాలకు అందని విధంగా పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న హార్దిక్ పటేల్ మహాత్మగాంధీ 8 దశాబ్దాల క్రితం చేపట్టిన దండి మార్చ్ ను ఆదర్శంగా తీసుకురి రివర్స్ దండి మార్చ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఉప్పు సత్యాగ్రహం కోసం గాంధీజీ చేపట్టిన దండి యాత్ర అప్పట్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరిలోను స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపింది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు ఉప్పు తయారీపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించి స్వాతంత్ర్యోద్యమాన్ని రేజ్ చేశారు. 1930 మార్చిలో గాంధీజీ 22 రోజుల పాటు 78 మైళ్ల పాటు దండి మార్చ్ చేశారు. గుజరాత్‌లోని పోరుబందర్‌లోని ఆయన ఆశ్రమం నుంచి కాలినడక సముద్రతీరంలో ఉన్న దండి వరకు పాదయాత్ర చేశారు.
ఇప్పడు హార్దిక్ పటేల్ కూడా పటేళ్లకు రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా గాంధీజీని ఆదర్శంగా తీసుకుని రివర్స్ దండి మార్చ్ ఎనౌన్స్ చేశాడు. ఈ వారంలోనే ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర దండి నుంచి పోరుబందర్‌లోని గాంధీ ఆశ్రమం వరకు జరుగుతుంది. ఈ రివర్స్ దండి మార్చ్ ప్రకటన వెలువడగానే పటేళ్ల ఉద్యమం ఒక్కసారిగా రేజ్ అయ్యింది. అయితే ప్రభుత్వం కూడా ఈ యాత్రను ఎట్టి పరిస్థితుల్లోను అడ్డుకుని..ఉద్యమ తీవ్రతను చల్లార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. హార్దిక్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.