Begin typing your search above and press return to search.

బీహార్ లో బీజేపీకి దెబ్బకొడతానంటున్న ''పటేల్''

By:  Tupaki Desk   |   19 Sept 2015 3:15 PM IST
బీహార్ లో బీజేపీకి దెబ్బకొడతానంటున్న పటేల్
X
బీసీ హోదా కోసం పోరాడుతున్న పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి హెచ్చరికలు పంపుతున్నారు. తమ ఆందోళనను తేలిగ్గా తీసుకుంటన్న బీజేపీకి బుద్ధి చెబుతానంటున్నారాయన... అందుకు బీహార్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండడంతో అక్కడ బీజేపీ అవకాశాలకు గండికొట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన అంటున్నారు. వచ్చే నెలలో బీహార్ లో నాలుగు ర్యాలీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హార్తిక్ హెచ్చరించారు.

'మా యువకుల ప్రాణాలు పోవడానికి కారణమైనవారిని వదిలిపెట్టం.. పటేళ్లపై జరుగుతున్న ఆకృత్యాలపై ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడడం లేదు. వారికి మేం బుద్దిచెబుతాం. బీహార్ లో వారి జోరుకు అడ్డువేస్తాం. నాలుగు చోట్ల భారీ ర్యాలీలు నిర్వహిస్తాం"" అని హార్తిక్ తీవ్రస్థయిలో హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న పటేళ్లను కదిలించి బీహార్ తీసుకెళ్తామని.. అక్కడ పటేళ్ల సముద్రం సృష్టిస్తామని హార్దిక్ అంటున్నారు.

ఇప్పటికే గుజరాత్ ను రచ్చరచ్చ చేస్తున్న హార్దిక్ తాజా హెచ్చరికలతో బీజేపీలో కాస్త కలవరం మొదలైంది. పైకి బింకంగా కనిపిస్తున్నా హార్దిక్ జోరు చూసి బీజేపీ భయపడుతోంది. బీహార్ లో ఇతర పార్టీ అనైక్యత వల్ల లాభపడాలని ప్రయత్నిస్తున్న సమయంలో హార్దిక్ కనుక అడ్డు తగిలితే ఇబ్బందేనని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారు.