Begin typing your search above and press return to search.
మోడీ, అమిత్ షాలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 31 Oct 2022 4:05 PM GMTవివాదాస్పద బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ సొంత పార్టీ నేతలపై నోరుపారేసుకునే ఆయన ఈసారి కూడా ఏకంగా బీజేపీ పెద్దలపై నోరుజారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు బీజేపీని షేక్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్యోదాంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని, అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.
2003 మార్చి 26న గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యకు గురయ్యారు. అహ్మదాబాద్ లో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన కారులో కూర్చొని ఉండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఐదు బెల్లెట్లు తాకడంతో ఆయన కారులోనే ప్రాణాలు విడిచారు.దాదాపు 2 గంటల పాటు ఆయన మృతదేహం కారులోనే ఉంది. ఆయన ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సహాయకుడిని పంపించగా హత్య జరిగిందన్న విషయం తెలిసింది.
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్టుగా ప్రచారం సాగింది. అల్లర్లకు బలైన బాధితుల మృతదేహాలను అహ్మదాబాద్ కు తీసుకురావడానికి పాండ్యా వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఉద్రిక్తతలకు దారితీస్తుందని పాండ్య అభిప్రాయం..
హరేన్ పాండ్య మాదిరిగా తనపై కూడా మోడీ, అమిత్ షా కుట్ర చేయబోరని భావిస్తున్నానని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. అలా అయితే తాను తన స్నేహితులను అప్రమత్తం చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్యలు బీజేపీని షేక్ చేస్తున్నాయి. మోడీ షాలు కుట్ర చేస్తారని ఆరోపించడంతో ప్రతిపక్షాలు సైతం దీన్ని ఆయుధంగా చేసుకుంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.