Begin typing your search above and press return to search.
బాబును పప్పుగా లెక్కేస్తున్న కంభంపాటి!
By: Tupaki Desk | 4 April 2018 5:03 PM GMTచంద్రబాబునాయుడు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరా? త న నిర్ణయాలను ఎవరు ప్రభావితం చేసినా.. ఆ ప్రభావానికి లోబడిపోయే స్థితిలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఎలా ఆడించదలచుకుంటే.. చంద్రబాబునాయుడు అలా ఆడేంత దౌర్బల్యంలో ఉన్నారా?
ఏమోగానీ.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాటలను వింటే మాత్రం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన ఉచ్చులో చిక్కుకుని.. చంద్రబాబు.. భారతీయ జనతా పార్టీ కూటమికి దూరం అయ్యారంటూ కంభంపాటి విసుర్లు విసురుతున్నారు. కంభంపాటి హరిబాబు.. తమ పార్టీ చేతికి మట్టి అంటకుండా.. అలాగని చంద్రబాబును కూడా నిందించకుండా.. తన సత్సంబంధాలను కాపాడుకోవడమే లక్ష్యమా అన్నట్లుగా.. హరిబాబు మాట్లాడుతుండడమే తమాషా.
రాజకీయంగా వైసీపీ కి బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదు అని కంభంపాటి హరిబాబు ధ్రువీకరించేస్తున్నారు. 2014లో కలిసి పోటీచేసి 2019 వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తే ఏదో ఒక నెపంతో మధ్యలో బయటికి వెళ్ళిపోయి అబాండాలు వేస్తున్నారని, వైసీపీ పన్నిన రాజకీయ ఉచ్చులో టీడీపీ పడింది తప్పితే రాజకీయంగా బీజేపీతో వైసీపీ దగ్గరైంది లేదు అని హరిబాబు చెప్పడం చూస్తోంటే కామెడీగా అనిపిస్తోంది. చంద్రబాబు మరీ అంత పప్పులాంటి అమాయకుడని, ఎవరో ఉచ్చు వేస్తే ఆయన అందులో ఈజీగా పడిపోతారని హరిబాబు అనుకుంటున్నారా అని జనం భావిస్తున్నారు.
మధ్యలో ఆయన వైసీపీ మీదనే నిందలు వేయడం విశేషం. ‘టీడీపీ, బీజేపీ మధ్య మిత్రబంధము పోవాలని వైసీపీ మొదటినుండి ఏదో ఒకరకంగా ప్రయత్నిస్తూనే ఉంది’ అంటున్న హరిబాబు మాటలు.. టీడీపీ వారు రాసిన స్క్రిప్టు లాగానే ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
హరిబాబు చెబుతున్న మరో కామెడీ ఏంటంటే.. కేవలం ప్రతిపక్షాల విమర్శలకు జడిసి.. చంద్రబాబు హోదా అడుగుతున్నారే తప్ప.. ప్యాకేజీ ఆయనకు నచ్చిందిట. ’2014 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన కేటాయింపులపై మాట్లాడడానికి భయపడ్డ తరహాలోనే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజి విషయంలో కూడా అదే పంథాలో ముందుకువెళ్లిన చంద్రబాబు - ప్రతిపక్షాలు విమర్శిస్తాయనే భయంతో రాష్ట్రానికి మేలు చేయకుండా అడ్డుపడుతున్నారని’ హరిబాబు తేల్చేస్తున్నారు.
మొత్తానికి ఆయన ప్రయాస చూస్తే చంద్రబాబు మీద ఈగ వాలకుండా, భాజపా ప్రతిష్టను కూడా కాపాడాలని ఆరాటపడుతున్నట్లుంది.