Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్యామిలీపై మావోనేత ఫైరింగ్
By: Tupaki Desk | 25 Aug 2015 5:31 AM GMTతెలంగాణ రాష్ట్ర సర్కారు మీద మావోలు తీవ్ర ఆగ్రహంతోనూ.. అసంతృప్తితో ఉన్నారా? తెలంగాణలో ఇప్పుడు దొరల పాలన సాగుతుందని మావోలు భావిస్తున్నారా? కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ తెలంగాణ రూపురేఖలు మార్పు రాలేదని అనుకుంటున్నారా? మావోలు తెలంగాణ సర్కారు గురించి ఏమనుకుంటున్నారు? ఎలాంటి భావనలో ఉన్నారు? మావోల పట్ల తెలంగాణ సర్కారు తీరు ఎలా ఉందన్న విషయాలకు సంబంధించి సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హోదాలో హరిభూషణ్ తొలిసారి ఒక ప్రముఖ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు.. ఆయన మాటల్లో చూస్తే..
= ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నది కుల పాలన. కుటుంబ పాలన. ఇది దొరల పాలన. తమ విలువైన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులు.. కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు.
= మేం ముందే చెప్పినట్లు.. ఇప్పుడు తెలంగాణ దొరలు.. భూస్వాములే ఏలుతున్నారు. ఎప్పటిలానే ప్రజలు అణిచివేతకు గురి అవుతున్నారు. ప్రతిపక్షం లేకుండా అంతా తన పక్షం చేసుకుంటున్నారు. నియంతల పాలనలోనూ మీడియాపై నిషేధం విధించింది లేదు. అంతకంటే క్రూరంగా పాలిస్తున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమించిన మున్సిపల్.. గ్రామపంచాయితీ కార్మికులు.. ఈజీఎస్ ఉద్యోగుల సమ్మెను ఉక్కుపాదంతోఅణిచివేశారు.
= వెలమ కుల పెద్ద.. పెట్టుబడిదారుడు రామేశ్వర్ రావు.. వెలమ కుల గురువు చిన జీయర్ స్వామిలే కేసీఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
= కేసీఆర్ కొడుకు కేటీఆర్.. కూతురు కవిత.. మేనల్లుడు హరీశ్ రావులే ప్రభుత్వానికి ప్రతినిధులైనప్పుడు కుటుంబ పాలన కాకుండా మరేం అవుతుంది?
= రామేశ్వర్ కోసం మెట్రో రైలు మార్గాన్ని మార్చారు. ఎందుకు మార్చారో కూడా అందరికి తెలుసు. పెట్టుబడిదారులను కూడగట్టటం.. లాబీయింగ్ చేయటం ఆయన పని. అధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామిని ముందు పెట్టి కేసీఆర్ యాదాద్రి.. పుష్కరాల పేరుతో వందల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ప్రజలను మైలిక సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తున్నారు.
= కేసీఆర్ నిసిగ్గుగా.. ఔను నేను దొరనే అని ప్రకటించుకున్న భూస్వామ్య వర్గాల ప్రతినిధి. నయా నిజాం. పులిపిల్ల ఎప్పుడూ మేకపిల్లకు న్యాయం చేయదు కదా. పల్లె ప్రజలు అనారోగ్యంతో కూనారిల్లుతున్నా పట్టించుకోకుండా ఆధునిక ఆయుధాలు.. వాహనాలు సమకూర్చిపెట్టారు. ఎన్నికల ముందు ఏయే అంశాల గురించి మాట్లాడారో అందుకు విరుద్ధంగా పాలన సాగుతోంది.
= గత పాలకుల కంటే తాను ఏమాత్రం తీసిపోలేదంటూ కేసీఆర్ తన చర్యల ద్వారా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే టీఆర్ ఎస్ పార్టీది మావోయిస్టు ఎజెండా కాదు.. మావోయిస్టుల నిర్మూలనే ప్రధాన ఏజెండా.