Begin typing your search above and press return to search.
అఖిలప్రియ పెళ్లికి అనుకోని అవాంతరం!
By: Tupaki Desk | 29 Aug 2018 5:34 AM GMTటీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడిగా.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత బావమరిదిగా సుపరిచితులైన సినీ నటుడు.. రాజకీయ నేత హరికృష్ణ మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది. నెల్లూరులో జరిగిన పెళ్లికి హాజరై హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళ.. అనుకోని రీతిలో చోటు చేసుకున్న రోడ్డుప్రమాదం షాకింగ్ గా మారింది.
హరికృష్ణకు సీరియస్ గా ఉందన్న విషయం తెలిసిన వెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేశ్ హుటాహుటిన హెలికాఫ్టర్ లో నార్కెట్ పల్లి కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ రోజు ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరుగుతోంది.
ఈ వివాహాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న హరికృష్ణ మరణవార్తతో టీడీపీలో విషాదం నెలకొంది. పార్టీ వ్యవస్థాపకుడి కుమారుడిగా.. పార్టీ అధినేత బావ మరిదిగా.. పార్టీ నేతగా తెలుగు తమ్ముళ్లతో ఎంతో అనుబంధం ఉన్న హరికృష్ణ అనుకోని రీతిలో మరణించిన వైనం అందరిని కలిచి వేస్తోంది. దీంతో.. అఖిలప్రియ వివాహానికి వెళ్లాలనుకున్న నేతలు.. ఇప్పటికే వెళ్లిన వారంతా హుటాహుటిన హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి అఖిల ప్రియ వివాహం నేపథ్యంలో నెలకొన్న సందడి.. హరికృష్ణ విషాదంతో పెను షాక్ గా మారినట్లైంది.