Begin typing your search above and press return to search.
అతివేగమే హరికృష్ణ ఆయువు తీసిందా.?
By: Tupaki Desk | 29 Aug 2018 7:39 AM GMTటీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు హరికృష్ణ మరణంతో తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. హరికృష్ణ ఈ ఉదయం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద సమయంలో హరికృష్ణే కారు నడుపుతున్నట్టు ఆయనతో కారులో కలిసి ప్రయాణిస్తున్న అరికెపూడి శివాజీ, వెంకట్రావ్ లు తెలిపారు. వీరిద్దరూ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
హరికృష్ణ ఈ ఉదయం 4.30గంటలకు హైదరాబాద్ నుంచి నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఓ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు బయలు దేరారు. కారులో శివాజీ - వెంకట్రావ లతో కలిసి వెళ్లారు. నల్గొండ జిల్లాలో కారు అదుపుతప్పడంతో హరికృష్ణ మరణించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ పక్కనే కూర్చున్న శివాజీ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ‘హరికృష్ణ కారు నడుపుతుండగా.. తాను ఆయన పక్క సీట్లో కూర్చోగా.. వెంకట్రావ్ వెనుక సీట్లో కూర్చున్నాడని.. ప్రమాద సమయంలో కారు 120 కి.మీ.ల వేగంతో వెళ్తోందన్నారు. ఒక రాయిని ఎక్కడంతోనే కారు అదుపు తప్పిందని శివాజీ తెలిపాడు. హరికృష్ణ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో కారులోనుంచి ఎగిరి బయట పడ్డాడని.. రాయిమీద పడడంతో తల - వెన్నుముకకు తీవ్ర గాయాలై సృహ కోల్పోయాడని తెలిపారు.
కాగా హరికృష్ణ కారు.. వేరే కారును ఢీకొట్టి పల్టీ కొట్టిందా.? లేక వేరే వాహనమే రాంగ్ రూట్ లో రావడంతో హరికృష్ణ తప్పించే ప్రయత్నంలో యాక్సిడెంట్ చేశాడా అన్నది తెలియ రావడం లేదు.
హరికృష్ణ మృతి వార్త తెలియగానే ఆయన కుమారులు కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లు కూడా హైదరాబాద్ కు బయలు దేరారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. రేపు అంత్యక్రియలు జరుగనున్నాయి.