Begin typing your search above and press return to search.
నారాయణ బాధ ఎంతో హరికృష్ణ చెప్పారు
By: Tupaki Desk | 10 May 2017 6:10 AM GMTఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు. కన్నకొడుకు పెద్దవాడు అవుతున్న కొద్దీ ప్రతిఒక్క తల్లిదండ్రులు వారి గురించి చాలానే ఆశలు పెట్టుకుంటారు. అయితే.. అనుకోని రీతిలో జరిగే ఘటనలు వారి కలల్ని కల్లలుగా చేయటమే కాదు.. అంతులేని విషాదాన్ని నింపుతుంటాయి. చేతినిండా అధికారం.. సంపదకు లోటు లేని వేళ.. చెట్టంత కొడుకు చనిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో చెప్పనలవి కానిది.
ఏపీ మంత్రి నారాయణ కుమారుడి రోడ్డు ప్రమాదం కూడా ఇదే తరహాలో ఉందని చెప్పాలి. ఈ ప్రమాదం గురించి సినీనటుడు.. టీడీపీ నేత నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. నిషిత్ ప్రాణాలు కోల్పోవటం ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసన్నారు. కొడుకు మరణించటం ఎంత బాధగాఉంటుందో తనకు బాగా తెలుసని.. నారాయణకు ఆయన కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లుగా హరికృష్ణ చెప్పారు. మూడేళ్ల క్రితం హరికృష్ణ కుమారుడు జానకిరామ్ నల్గొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.