Begin typing your search above and press return to search.
సీతయ్య... ఎవరి మాట వినలేదు..
By: Tupaki Desk | 29 Aug 2018 3:39 AM GMTనందమూరి హరిక్రష్ణ. నటుడిగా... రాజకీయ నాయకుడిగా.... వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ రంగంలోనూ కూడా ఎవరి మాట వినరనే పేరు ఉంది. ఇది చాలా వరకూ నిజమేనంటున్నారు ఆయన సన్నిహితులు. తన తండ్రి, మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును కూడా ధిక్కరించిన నైజం హరిక్రష్ణ సొంతం. తన తండ్రి
ఎన్.టి.రామారావు రెండో భార్యగా లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవాలని భావించి ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన సమయంలో ముందుగా వ్యతిరేకించింది నందమూరి హరికృష్ణే అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతూంటారు. పార్టీలో చీలిక రాకుండా తీవ్రంగా ప్రయత్నించిన హరికృష్ణ చివరకు తన బావ చంద్రబాబు నాయుడి వెనుక ఉండి తండ్రికి ఎదురుతిరిగారు.
నిజానికి హరికృష్ణనే దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు అత్యంత సన్నిహితుడు. ఈయనకు చెప్పకుండా ముఖ్యమంత్రి హోదాలో ఎన్.టి.రామారావు ఏ పని చేసే వారు కాదని అంటారు. లక్ష్మీపార్వతి తన తండ్రి జీవితంలోకి రానంత వరకూ హరికృష్ణ చ్రకం తిప్పారు. ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలను ఎన్.టి.రామారావు తీసుకుంటే వాటిని అమలు పరిచే బాధ్యత హరిక్రష్ణే తీసుకునే వారని చెబుతారు.
ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న హరికృష్ణ తనకు నచ్చిన పని చేసేవారని, నచ్చని పని ఏదైనా... ఎవరు చెప్పినా వినే వారు కాదని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా ఇదే పద్దతి అని ఆయన సన్నిహితులు చెప్తారు. ఇందుకే ఆయనకు ఎవరి మాట వినడు అనే పేరు వచ్చిందంటారు. తండ్రిని అధికారం నుంచి దూరం చేసినప్పుడు కూడా హరికృష్ణ ఇలాగే ప్రవర్తించారని అంటారు.
కుటుంబ సభ్యుల్లో కొందరు తండ్రికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పినా ఆయన ఎవరి మాట వినకుండా బావ చంద్రబాబు నాయుడి వెనుక ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్‌లో తనకు మంత్రి పదవి వద్దని హరికృష్ణ వారించినా... అభిమానుల కోరిక మేరకు ఆయన ఆ పదవిని తీసుకున్నారు. రవాణా శాఖ మంత్రిగా పని చేపిన హరికృష్ణ ఆ శాఖలో కూడా ఎవరి మాట వినకుండా ఉద్యోగులు, కార్మికులకు ఏది మంచి అనిపిస్తే అదే చేసే వారనే పేరు ఉంది. కొన్ని నిర్ణయాలకు అధికారుల నుంచి వ్యతిరేకత వచ్చినా వారి మాట వినే వారు కాదనే పేరు హరికృష్ణకు ఉంది.